బిజెపి శ్రేణులకు విందు పార్టీ ఇచ్చిన డీకే అరుణ

హుజురాబాద్ ఉప ఎన్నికలో బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ తెరాస అభ్యర్థి ఫై విజయ డంఖా మోగించడం తో బిజెపి శ్రేణుల్లో కొత్త జోష్ నింపింది. ఈ జోష్ తో తెరాస సర్కార్ ను అడుగడుగునా ఇరకాటంలో పెడుతూ వస్తుంది. గత కొద్దీ నెలలుగా బిజెపి నేతలు , కార్యకర్తలు క్షణం తీరిక లేకుండా గడుపుతూ వస్తున్నారు. ఇంట్లో కంటే ఎక్కువ సమయం పార్టీ ప్రచారంలో మునిగితేలారు. ఈ తరుణంలో శనివారం రాత్రి నగర శివార్లలోని తమ వ్యవసాయ క్షేత్రంలో రాష్ట్ర పార్టీ నాయకులకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విందునిచ్చారు. ఈ విందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ కార్యవర్గసభ్యులు, రాష్ట్ర పార్టీ పదాధికారులు, వివిధ మోర్చాల నాయకులు హాజరయ్యారు.

వీరి బాటలోనే మరికొందరు ముఖ్యనేతలు కూడా విందులిచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పార్టీ వర్గాల సవచారం. ఇదిలా ఉంటే.. బీజేపీలో ముఖ్యనేతల మధ్య ఏర్పడిన అంతరాలు, అసంతృప్తులను దూరం చేసుకునేందుకు ఒక రహస్య ప్రదేశంలో సమావేశమయ్యారనే వార్తలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. ఏది ఏమైనప్పటికి ఈటెల రాకతో బిజెపి వర్గాల్లో సరికొత్త బలం వచ్చినట్లు అయ్యింది. అందుకే విందు కార్యక్రమాలతో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు.