ఈటెల వ్యాఖ్యలు చూస్తే..పొంగులేటి బిజెపి లో చేరడం కష్టమే..

పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావులు ఏ పార్టీ లో చేరతారనేది ఇంకా స్పష్టత రావడం లేదు. ఇప్పటీకే హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ వీరిద్దరితో పలుమార్లు భేటీ అయినప్పటికీ , వీరు మాత్రం బిజెపి లో చేరేందుకు పెద్దగా ఇంట్రస్ట్ చూపించడం లేదని తెలుస్తుంది. తాజాగా ఈటెల చేసిన వ్యాఖ్యలతో ఇది నిజమే అని అంత మాట్లాడుకుంటున్నారు.

తాను ప్రతిరోజు పొంగులేటి, జూపల్లితో మాట్లాడుతున్నానని, కానీ వారు బీజేపీలో చేరడం కష్టమేనని చెప్పుకొచ్చారు. పైగా వారు తనకు రివర్స్ కౌన్సిలింగ్ ఇస్తున్నారని ఈటెల అన్నారు. ఇప్పటివరకు వారిని కాంగ్రెస్ లో చేరకుండా మాత్రమే ఆపగలిగానని ఈటల తెలిపారు. బీజేపీలో చేరడానికి వారికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని అన్నారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ బలంగా ఉందని తెలిపారు.