రాష్ట్రంలో 12 ప్రాంతాలను కంటైన్‌మెంట్‌ క్లస్టర్‌లుగా ప్రకటన

ఉత్తర్వులు జారీ చేసిన జీహెచ్‌ఎంసీ కమీషనర్‌

doctors
doctors

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదయిన 12 ప్రాంతాలను కంటైన్‌మెంట్‌ క్లస్టర్‌లుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో కూకట్‌పల్లి, యూసఫ్‌గూడ, చందానర్‌, గాజులరామారం, మూసాపేట్‌, రెడ్‌హిల్స్‌, రాంగోపాల్‌పేట సహ పలు ప్రాంతాలు, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాలోని మూడు ప్రాంతాలను కరటైన్‌మెంట్‌ క్లస్టర్‌లుగా ప్రకటిస్తు జీహెచ్‌ఎంసి కమీషనర్‌ డిఎస్‌ లోకేష్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రాంతాలలో అధికారులు ఇంటింటికి వెళ్లి తనిఖీలు చేస్తారు. కరోనా లక్షణాలు కనిపించిన వారిని వెంటనే క్వారంటైన్‌ లేదా ఐసోలేషన్‌కు తరలిస్తారు. వీధులను శుభ్రంచేస్తారు. ఈ ప్రాంతాలలోని వ్యక్తులు బయటికి వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటుచేస్తారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/