బిజెపికి భారీ షాక్..కీలక నేతలు బిఆర్ఎస్ లోకి…

తెలంగాణ లో బిజెపికి వరుస షాకులు ఎదురవుతూనే ఉన్నాయి. కొద్దీ రోజులుగా బిజెపి నేతలంతా కాంగ్రెస్ , బిఆర్ఎస్ లోకి చేరుతున్నారు. తాజాగా శుక్రవారం బీజేపీ నేత వెంకట్ రెడ్డి కారెక్కారు. ఆయన సతీమణి పద్మా వెంకట్ రెడ్డి కూడా గులాబీ గూటికి చేరారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కేటీఆర్ వారికి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వెంకటరెడ్డి బీజేపీ గద్వాల్ జిల్లా ఇంచార్జ్‌గా ఉండగా.. ఆయన సతీమణి పద్మా వెంకట రెడ్డి బాగ్ అంబర్‌పేట్ డివిజన్ కార్పొరేటర్‌గా ఉన్నారు.

దాదాపు 40 ఏళ్లుగా వెంకటరెడ్డి బీజేపీలో కొనసాగారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ నుంచి అంబర్‌పేట టికెట్‌ను ఆయన ఆశించారు. కిషన్ రెడ్డి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లారు. కానీ ఆయన నుంచి టికెట్‌కు సంబంధించి ఎలాంటి హామీ రాకపోవడంతో గత కొంతకాంగా బీజేపీలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఇటీవల వెంకటరెడ్డి దంపతులు బీజేపీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ లో చేరారు.