బాలకృష్ణకు దమ్ముంటే ఈ కేసులో ఈడీ విచారణ కోరాలి: రోజా డిమాండ్

అసెంబ్లీలో చర్చించకుండా తప్పించుకుంటున్నారని విమర్శ

If Balakrishna has guts, ED should seek inquiry in this case: Roja demands

అమరావతిః నందమూరి బాలకృష్ణ సహా టిడిపి ఎమ్మెల్యేలకు మంత్రి రోజా సవాల్ విసిరారు. అసెంబ్లీ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ… స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో స్కాం జరిగిందనే అంశంపై చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు. బాలకృష్ణకు దమ్ముంటే ఈ కేసులో ఈడీ విచారణ కోరాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ఈ అంశంపై చర్చిద్దామంటే టిడిపి పారిపోయిందని విమర్శలు గుప్పించారు.

అసలు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో స్కాంపై ప్రభుత్వం వద్ద ఆధారాలు లేవని టిడిపి నేతలు చెబుతున్నారని, అలాంటప్పుడు హైకోర్టు చంద్రబాబు క్వాష్ పిటిషన్ ఎందుకు కొట్టివేసిందని ప్రశ్నించారు. ఇప్పుడు టిడిపి ఏం చెబుతుంది? అన్నారు. తనపై కేసులు కొట్టివేయాలని చంద్రబాబు వేసిన పిటిషన్లను కొట్టివేసిందని, అసెంబ్లీ చర్చించకుండా తప్పించుకున్నారని మండిపడ్డారు.

‘తనపై వేసిన కేసులను కొట్టివేయాలని మీరు వేసిన పిటిషన్లను.. అది కుదరదని చెప్పి హైకోర్టు కొట్టేసింది.. ఇప్పుడేమంటావ్ బాలకృష్ణా! అని నేను అడుగుతున్నాను. అసెంబ్లీకి వచ్చి చిల్లర చేష్టలు చేయడం కాదు. నీకు దమ్ముంటే, దైర్యం ఉంటే హైకోర్టు వద్దకు వెళ్లి, జడ్జి ముందు ఇలాగే తొడగొట్టి, మీసం తిప్పి, విజిల్స్ వేయండి అప్పుడు తెలుస్తుంది’ అని మండిపడ్డారు.