లాయర్ సిద్ధార్ధ్ లూథ్రా మరో ట్వీట్

ప్రముఖ సీనియర్ లాయర్ సిద్ధార్ధ్ లూథ్రా ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసి వార్తల్లో నిలిచారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయినా చంద్రబాబు తరుపున సిద్దార్థ్ కోర్ట్ లో వాదనలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సుప్రీం కోర్ట్ లో ఎంతో పేరున్న సిద్దార్థ్..ఏపీ కోర్ట్ లలో మాత్రం తన మార్క్ చూపించుకోలేకపోతున్నాడు. ఏ కేసునుండి కూడా చంద్రబాబు ను బయటకు తీసుకరాలేకపోతున్నాడు. దీంతో సిద్దార్థ్ ఫై పలు విమర్శలు సైతం మొదలయ్యాయి.

ఈ క్రమంలో సిద్దార్థ్ ట్విట్టర్ లో ప్రతీరాత్రి తెల్లవారుతుంది. ప్రతీ ఉదయం మన జీవితాల్లో వెలుగునిస్తుంది అంటూ ఆయన ట్వీట్ చేశారు. చంద్రబాబు పిటిషన్ కొట్టివేయడాన్ని ఉదాహరణగా చూపిస్తూ లూథ్రా ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. ఈరోజు బెయిల్ రాకపోతే రేపు వస్తుంది అని చెబుతున్నట్లు అనిపిస్తోంది. దీనిబట్టి చంద్రబాబు కేసును సిద్ధార్ధ్ లూథ్రా అంత తేలికగా వదిలేయడం లేదని…దీనికి సంబంధించి నెక్స్ట్ స్టెప్స్ బలంగా వేయడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది.