కెటిఆర్ సమక్షంలో బిఆర్ఎస్‌లో చేరనున్న తుల ఉమ

bjp-leader-tula-uma-will-join-the-brs-party-today

హైదరాబాద్‌ః వేములవాడ బిజెపి నేత తుల ఉమ సొంత గూటికి వెళ్లనున్నారు. బిజెపికి రాజీనామా చేసిన తుల ఉమ నేడు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. బిజెపికి తుల ఉమ రాజీనామా చేశారు. బిజెపి నేత తుల ఉమా సొంతగూటికి చేరనున్నారు. దీంతో నాలుగు రోజులుగా సాగుతున్న హైడ్రామాకు తెలపడింది.

వేములవాడ నుంచి బిజెపి టికెట్ ఆశించిన ఆమె చివరి నిమిషంలో తీవ్ర అవమానాల పాలయ్యారు. వేములవాడ అసెంబ్లీ సీటుకు టికెట్ ఇచ్చిన బిజెపి చివరి నిమిషంలో బిఫామ్ వేరొకరికి ఇచ్చింది. దీంతో ఆమె తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. తన అనుచరులతో సమావేశాలు అనంతరం తిరిగి బిఆర్ఎస్ లో చేరడానికి నిర్ణయించుకున్నారు. కెసిఆర్ తో ఆమె ఫోన్ లో మాట్లాడారు. పార్టీలో చేరే విషయం చర్చించారు. కెసిఆర్ స్పష్టమైన హామీల తర్వాత బిఆర్ఎస్ లో చేరడానికి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.