ప్రారంభమైన చార్‌ధామ్‌ యాత్ర

డెహ్రాడూన్‌: చార్‌ధామ్‌ యాత్ర మంగళవారం ప్రారంభమైంది. గంగోత్రి, యమునోత్రి ఆలయ ద్వారాలను తెరిచి ప్రత్యేక పూజలు చేశారు. 2019 తర్వాత ఎలాంటి కరోనా ఆంక్షలు లేకుండా భక్తులను అనుమతించడం ఇదే తొలిసారి. ఈ సారి యాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొనే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. కేదార్‌నాథ్‌ ఆలయ ద్వారాలను 6న, బద్రీనాథ్‌ ఆలయ గేట్లను 8న తెరుస్తారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/