బిజెపి ప్ర‌భుత్వం రైతులకు లాభం చేకూర్చే ప‌థకాల‌పై క‌స‌ర‌త్తు సాగిస్తోందిః ప్ర‌ధాని మోడీ

Bjp govt working on schemes to benefit farmers’: PM in Haryana amid protests

న్యూఢిల్లీ : హ‌రియాణ‌లోని రెవారిలో ఎయిమ్స్‌కు ఈరోజు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ శంకుస్ధాప‌న చేశారు. అనంత‌రం మోడీ బ‌హ‌రంగ స‌భ‌లో మాట్లాడుతూ.. రైతుల సంక్షేమానికి క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు. కేంద్రంలో అంత‌కుముందు ప‌దేండ్ల యూపీఏ హ‌యాంలో రైతుల‌కు చేసిందేమీ లేద‌ని మోడీ దుయ్య‌బ‌ట్టారు. క‌నీస మద్ద‌తు ధ‌ర (ఎంఎస్‌పీ)కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త స‌హా ప‌లు డిమాండ్ల‌పై రైతులు త‌మ ఆందోళ‌న‌ను ఉధృతం చేస్తుండ‌గా రైతుల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కేంద్రంలోని బిజెపి ప్ర‌భుత్వం రైతులకు లాభం చేకూర్చే ప‌ధ‌కాల‌పై క‌స‌ర‌త్తు సాగిస్తోంద‌ని అన్నారు. గ‌తంలో రైతుల‌కు రుణాలిచ్చేవారు కాద‌ని, అలాంటిది కేంద్రం రైతుల‌కు బ్యాంకు లోన్లు అందేలా గ్యారంటీ క‌ల్పించింద‌ని అన్నారు. రైతుల‌కు తాము మోదీ గ్యారంటీ క‌ల్పించామ‌ని, బ్యాంకులు అన్న‌దాత‌ల‌కు గ‌తంలో రుణాలిచ్చేవి కాద‌ని, కానీ తాము రైతుల‌కు గ్యారంటీ ఇచ్చామ‌ని మోడీ వివరించారు.