భారత్ చేరుకున్న మరో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం

న్యూఢిల్లీ : ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన విద్యార్థులను తీసుకువెళుతున్న నాల్గవ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం బుకారెస్ట్ నుండి హిండన్ విమానాశ్రయానికి చేరుకుంది. కేంద్ర సహాయ మంత్రి అజయ్ భట్ విమానాశ్రయంలో విద్యార్థులకు స్వాగతం పలికారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉక్రెయిన్ నుంచి ప్రతి భారతీయ విద్యార్థిని తరలించడంపై స్వయంగా ప్రధాని మోడీ దృష్టి పెట్టారని తెలిపారు. భారతీయులకు ఇండియాకు తీసుకొచ్చిన క్రూ టీమ్‌ని కూడా అభినందించారు. ప్రతి బిడ్డను ఆదుకుంటున్నామని తెలిపారు. ఉక్రెయిన్ సరిహద్దుల్లో కూడా మన నలుగురు మంత్రులు ఒకరినొకరు చూసుకుంటున్నారని ప్రకటించారు. మన వైమానిక దళం, పౌర విమానయాన నౌకలు నిరంతరంగా వెళ్తున్నాయి. ఈ విమానంలో 180 మంది భారతీయులు వచ్చారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/