జీవన్ రెడ్డి ఫై ఈసీకి బీజేపీ ఫిర్యాదు

కాంగ్రెస్ మ్మెల్సీ, నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న జీవన్ రెడ్డి ఫై కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ మార్ఫింగ్ వీడియోను జీవన్ రెడ్డి ఎడిట్ చేసి వైరల్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. ‘కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే SC, ST, OBC రిజర్వేషన్లు ఎత్తేస్తాం’ అని అర్థం వచ్చేలా వీడియో ఉందని.. దీన్ని వైరల్ చేస్తున్న ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరింది.

ప్రస్తుతం తెలంగాణ లో లోక్ సభ ఎన్నికల ప్రచారం..వాడి వేడిగా నడుస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ – బిజెపి- బిఆర్ఎస్ మధ్య మాటల వార్ నడుస్తుంది. బిజెపి ముస్లిం రిజర్వేషన్లు ఎత్తివేస్తామని చెప్పడంతో దీనిపై కాంగ్రెస్ , బిఆర్ఎస్ పెద్దగా విమర్శలు చేస్తూ,,ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్లు అంటున్నారు..అధికారంలోకి వచ్చాక SC, ST, OBC రిజర్వేషన్లు కూడా ఎత్తివేస్తారని కాంగ్రెస్ ఆరోపిస్తూ వస్తుంది. ఈ తరుణంలో జీవన్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ మార్ఫింగ్ వీడియోను జీవన్ రెడ్డి ఎడిట్ చేసి వైరల్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది.