పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్..

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ని పోలీసులు వరంగల్ రచ్చబండ కార్యక్రమానికి వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేసారు. ఉదయాన్నే పెద్ద ఎత్తున పోలీసులు రేవంత్ ఇంటిని ముట్టడించి ఆయన్ను బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. పోలీసుల తీరుపట్ల కాంగ్రెస్ నేతలు రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు కొండపల్లి దయాసాగర్‌ తండ్రి దశదిన కర్మకు వెళ్లడంతో పాటు.. ఇటీవల శబరిమలలో చనిపోయిన కాంగ్రెస్‌ నాయకుడు చరణ్‌ కుటుంబాన్ని పరామర్శించడానికి వరంగల్‌ వెళ్లనున్నట్లు రేవంత్‌ ప్రకటించారు. కానీ అంతకుముందు రచ్చబండ కార్యక్రమాన్ని చేపడతానని చెప్పడం తో పోలీసులు అనుమానంతో ఆయన్ను హౌస్ అరెస్ట్ చేసారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక నాల్గు రోజుల క్రితం కూడా ఇలాగే రేవంత్ ను కేసీఆర్ దత్తత గ్రామమైన ఎర్రవల్లిలో చేపట్టనున్న ‘రచ్చబండ’ కార్యక్రమానికి వెళ్లకుండా అరెస్ట్ చేసారు.

ఎర్రవల్లిలో మీటింగ్ పెట్టడానికి రేవంత్‌ రెడ్డికి అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో.. ఎలాగైనా రచ్చబండ నిర్వహించి తీరుతామని కాంగ్రెస్ శ్రేణులు పట్టుపడడంతో అప్రమత్తమైన పోలీసులు కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడు అరెస్టులు చేసారు. చాలామంది నేతల ఇళ్ల ముందు తెల్లవారుజాము నుంచే పహారా కాస్తూ వారందరిని హౌస్ అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటె ఎర్రవల్లి లో రేవంత్ చేపట్టిన రచ్చబండ ఫై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు. రేవంత్ రెడ్డి తలపెట్టిన రచ్చబండ కార్యక్రమంపై సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరికీ తెలియకుండా కార్యక్రమం తలపెట్టడమేంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఒక కార్యక్రమం చేపట్టేముందు ముఖ్యనేతలతో చర్చించకుండా రేవంత్ రెడ్డి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. దీనిపై సీనియర్ నేతలు గుర్రుమంటున్నారు. ముఖ్యంగా వీ.హనుమంతరావు, ఎమ్మెల్యే జగ్గారెడ్డిలు బహిరంగంగా అభ్యంతరం వ్యక్తం చేసారు. జగ్గారెడ్డి ఏకంగా రేవంత్ ఫై సోనియా కు లేఖ రాయడం వైరల్ గా మారింది.