పవన్ ఎటు తేల్చకోలేకపోతున్నాడా..?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుండి పోటీ చేస్తారనేది అర్ధం కావడం లేదు. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోవడం తో ఈసారి ఎలాగైనా విజయం సాధించి అసెంబ్లీ లో అడుగుపెట్టాలని చూస్తున్నారు. అయితే నిన్న బిజెపి తో పొత్తు పెట్టుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ కాకినాడ ఎంపీ బరిలో కూడా దిగబోతున్నట్లు ఓ వార్త బయటకు వచ్చింది. దీంతో పవన్ పోటీ ఫై అందరిలో అనేక అనుమానాలు మొదలయ్యాయి. కొంతమంది అసెంబ్లీ బరినుండి పవన్ తప్పుకున్నాడని అంటుంటే..లేదు లేదు ఎంపీ తో పాటు ఎమ్మెల్యే గా కూడా బరిలోకి దిగబోతున్నాడని అంటున్నారు.

ప్రస్తుతం మాత్రం గాజువాక, పిఠాపురంపై పార్టీ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. గాజువాకలో కాపు ఓటు బ్యాంకుతో పాటు జనసేనకు కార్యకర్తల బలముంది. ఇప్పటికే పోల్ మేనేజ్మెంటు నేతలు ఏర్పాట్లు చేశారట. ఇటు కాపు ఓట్లు బాగా ఉన్న పిఠాపురంలో పోటీ చేయాలని శ్రేణులు కోరుతుండటంతో అక్కడ సర్వే చేస్తున్నారట. కాకినాడ MPగా పోటీపైనా పవన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరి దీనిపై త్వరగా ఏదో ఒకటి తెలుస్తే బెటర్ అని అంటున్నారు.