దలైలామా వారసుడి ఎంపిక టిబెటియన్స్ దే
అమెరికా కాంగ్రెస్ ఆమోదం

Washington: ఆధ్యాత్మిక నాయకుడు దలైలామా వారసుడిని ఎంపిక చేసుకునే హక్కు టిబెటన్లదేనంటూ పునరుద్ఘాటించే బిల్లును అమెరికా కాంగ్రెస్ ఆమోదించింది.
ఈ చట్టాన్ని చైనాకు స్పష్టమైన సందేశమని ధర్మశాల అభివర్ణించింది. సెనేట్ ఆమోదించిన టిబెటన్ పాలసీ అండ్ సపోర్ట్ యాక్ట్ 2020లో లాసాలో అమెరికా కాన్సులేట్ ఏర్పాటును కోరింది.
దలైలామా పునర్జన్మకు సంబంధించి న నిర్ణయాలు ప్రస్తుత దలైలామా, టిబెటన్ నాయకులు, ప్రజల అధికారంలోనే ఉన్నాయని యూస్ చట్టం పేర్కొందని సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.
టిబె టన్ స్వాతంత్య్ర పోరాటంలో సాధించిన విజయంగా లోబ్సాంగ్ వెల్లడించారు. ఈ చట్టం దలైలామా వారసత్వానికి, టిబెట్లోపల ఆరు మిలియన్ల ప్రజల ధైర్యం, సంఘీభావానికి కానుకని చెప్పారు. కాగా ఈ బిల్లును ప్రతినిధుల సభ ఇదివరకే ఆమోదించింది.
తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/business/