నంద్యాల లో టెన్షన్..భూమా అఖిల ప్రియ అరెస్ట్

చంద్రబాబు అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ.. నంద్యాలలో చంద్రబాబును అరెస్టు చేసిన ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద భూమా అఖిల ప్రియ, ఆమె సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి రెండు రోజులుగా నిరవధిక దీక్ష చేస్తున్నారు. అయితే, పోలీసులు వారి దీక్షను భగ్నం చేశారు. ఈ రోజు తెల్లవారుజామున అఖిల, తమ్ముడు విఖ్యాత్‌, భర్త భార్గవ్‌రామ్‌ని అరెస్ట్ చేశారు. అనంతరం ఆళ్లగడ్డలోని వారి ఇంటికి తరలించారు. ఈ సందర్భంగా అఖిల ప్రియ మాట్లాడుతూ.. ఇంట్లో కూర్చోబెట్టినంత మాత్రాన దీక్షను ఆపేది లేదన్నారు. నా తమ్ముడికి ఏదైనా జరిగితే అందుకు నంద్యాల ఎస్పీ, డీఎస్పీలే బాధ్యత వహించాలని సంచలన వాఖ్యలు చేశారు అఖిల ప్రియ.

రెండు రోజులుగా దీక్ష చేస్తున్ నేపథ్యంలో అఖిల ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ తర్వాత ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలు చేసిన తర్వాత అఖిలను ఆళ్లగడ్డలోని వారి నివాసానికి తరలించారు పోలీసులు. అరెస్ట్ తర్వాత సైతం దీక్షను కొనసాగిస్తానని అఖిల చెప్పడంతో ఆళ్లగడ్డలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆమె దీక్ష అలాగే కొనసాగిస్తే.. మళ్లీ అరెస్ట్ చేసే అవకాశం ఉంది.