సర్వభూపాల వాహ‌నంపై ఉభయదేవేరులతో శ్రీవారు

వైభవంగా తిరుమల బ్రహ్మోత్సవాలు

tirumala-brahmotsavam
 సర్వాలంకార భూషితుడైన శ్రీవారు భక్తులను ఓలలాడించారు.

తిరుమల: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఎనిమిదోవ రోజు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో శనివారం శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్సవ మండ‌పంలో శ్రీ మలయప్పస్వామివారు ఉభయదేవేరులతో కలిసి సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. సర్వాలం కార భూషితుడైన శ్రీవారు భక్తులను ఓలలాడించారు. పండితుల వేదమంత్రోచ్ఛరణల మధ్య అర్చకులు స్వామివారికి హారతులు ఇచ్చారు. తిరుమల బ్రహ్మోత్సవాలు ఈసారి భక్తులు లేకుండా జరుగుతున్నాయి. కరోనా వైరస్ కారణంగా… బ్రహ్మోత్సవాల్ని లైవ్‌లో చూసేలా అన్ని ఏర్పాట్లూ చేశారు.

 పండితుల వేదమంత్రోచ్ఛరణల మధ్య అర్చకులు స్వామివారికి హారతులు ఇచ్చారు.

 తిరుమల బ్రహ్మోత్సవాల దృశ్యాలు

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/