మరికాసేపట్లో చంద్రబాబు ను విచారించనున్న CID అధికారులు

స్కిల్ డెవలప్ స్కామ్ లో ఆరోపణలు ఎదురుకుంటున్న మాజీ సీఎం , టీడీపీ అధినేత చంద్రబాబు ను మరికాసేపట్లో CID అధికారులు విచారించనున్నారు. చంద్రబాబును విచారించేందుకు విజయవాడ నుంచి రాజమండ్రికి బయలుదేరారు సీఐడీ అధికారులు. 12 మందితో కూడిన బృందం.. చంద్రబాబును విచారించనుంది. ఈ బృందంలో 9 మంది సీఐడీ అధికారులు, సిబ్బందితో పాటు ఒకక వీడియో గ్రాఫర్, ఇద్దరు మధ్యవర్తులు ఉన్నారు. వారి పేర్లతో కూడిన జాబితాను సీఐడీ తరపు న్యాయవాదులు నిన్న ఏసీబీ న్యాయస్థానానికి సమర్పించారు.

ఆర్థిక నేరాల విభాగం-2 డీఎస్పీలు ఎం. ధనుంజయుడు, వి.విజయ్ భాస్కర్, ఎ. లక్ష్మీనారాయణ, ఇన్స్‌పెక్టర్లు ఎన్.ఎల్.వి.మోహన్ కుమార్, వై. రవికుమార్, ఐ. శ్రీనివాసన్, సీహెచ్.సాంబశివరావు, ఏఎస్సై పి. రంగనాయకులు, కానిస్టే బుల్ ఎం.సత్యనారాయణ.. ఈ బృందంలో ఉంటారని సీఐడీ న్యాయవాదులు న్యాయస్థానానికి వివరించారు.

కోర్టు ఆదేశాల మేరకు ఉదయం 9:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు చంద్రబాబును విచారించనున్నారు సీఐడీ అధికారులు. కస్టడీ విచారణకు చంద్రబాబు తరఫున ఇద్దరు లాయర్లకు అనుమతి ఇవ్వడం జరిగింది. రెండు రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంద్రబాబును ప్రశ్నించనున్నారు.