ఏపీలో విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన సర్కార్

telangana-government-announced-christmas-and-sankranti-holidays

మరో మూడు రోజుల్లో సంక్రాంతి సంబరాలు మొదలుకానున్న నేపథ్యంలో విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలో విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులను ప్రకటించింది. జనవరి 9 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈసారి జనవరి 13న రెండో శనివారం, జనవరి 14న (ఆదివారం) భోగి పండుగ, జనవరి 15 సంక్రాంతి పండగ వచ్చింది. జనవరి 16 ,17 , 18 తేదీల వరకు సెలవులను ఖరారు చేసింది.

ప్రభుత్వం ముందుగా 16 వరకే సెలవులు ఉంటాయని భావించిన స్కూలు కాలేజీలకు మరో రెండు రోజులపాటు అదనంగా సెలవులు ప్రకటించింది. అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వ ప్రవేట్ స్కూల్ లకు ఈనెల 9 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు అన్ని యాజమాన్యాలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది .అలాగే సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అంతేకాదు ఈ నెలలో మొత్తంగా 11 నుంచి 13 రోజుల పాటు సెలవులు వచ్చాయి. జనవరి 25న ఆదివారం జనవరి 26 రిపబ్లిక్ డే రావడంతో వరుస సెలవులు విద్యార్థులకు వచ్చాయి.