ఏపీలో మూడవ రోజు కొనసాగుతున్న రాహుల్ పాదయాత్ర

bharat-jodo-yatra-of-the-congress-party-resumes-from-banavasi-village-in-kurnoo

కర్నూలు: ఏపీలోని కర్నూలు జిల్లాలో మూడవ రోజు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. ఈరోజు ఉదయం ఎమ్మిగనూరు మండలం బనవాసి నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. మధ్యాహ్నం ముగతి గ్రామం చేరుకోనుంది. అక్కడ రాహుల్ భోజనం చేసి, కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం 4 గంటలకు తిరిగి పాదయాత్ర ప్రారంభించనున్నారు. సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు కల్లుదేవకుంట గ్రామంలో కార్నర్ మీటింగ్ లో ఆయన పాల్గొంటారు. రాహుల్ అక్కడి నుంచి రాత్రి మంత్రాలయం చేరుకోనున్నారు. అనంతరం రాఘవేంద్ర స్వామిని దర్శించుకొని.. చెట్నిహళ్లిలో బస చేయనున్నారు. ఈ యాత్ర కోసం ఏపీ కాంగ్రెస్ అన్ని ఏర్పాట్లు చేసింది.

ఏపీలో 21 వరకు రాహుల్ పాదయాత్ర కొనసాగనుంది. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 96 కిలో మీటర్లకు పైగా పాదయాత్ర చేయనున్నారు. ఏపీకి చెందిన కీలక నాయకులతోపాటు.. తెలంగాణ నేతలు కూడా ఈ యాత్రలో పాల్గొంటున్నారు. ఏపీ నుంచి కర్ణాటకకు, ఆ తర్వాత 23న తెలంగాణకు రాహుల్ భారత్‌ జోడో యాత్ర చేరుకోనుంది. కాగా, సెప్టెంబరు 7న తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైన భారత్‌ జోడో యాత్ర 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా 3వేల 700 కిలోమీటర్ల మేర సాగనున్నది.