అమెరికాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

నిన్న ఒక్కరోజే 70,740 మందికి పాజిటివ్

వాషింగ్టన్ : అమెరికాలో మళ్లీ కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయి. రికార్డు స్థాయిలో రోజువారీ కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే దేశంలో 8.07 లక్షల టెస్టులు చేస్తే, 70,740 కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రోజుతో పోలిస్తే కేసులు 5.94% పెరిగాయి. ప్రపంచంలోనే రోజువారీ కేసుల్లో అమెరికా మళ్లీ మొదటి స్థానంలో ఉంది. ఇండోనేసియాలో 45,203, బ్రెజిల్ లో 41,411 కేసులు నమోదైనట్టు అమెరికాలో రోజువారీ కరోనా కేసుల వివరాలను వెల్లడిస్తున్న జాన్స్ హాప్కిన్స్ యూనివర్సటీ పేర్కొంది.

అయితే, వ్యాక్సినేషన్ ఎక్కువగా జరగని ప్రాంతాల్లోనే కేసులు పెరుగుతున్నాయని అక్కడి అధికారులు చెబుతున్నారు. అమెరికాలో ఇప్పటిదాకా 3,54,87,490 మంది కరోనా బారిన పడగా.. 6,28,098 మంది చనిపోయారు. కాగా, నిన్న 3,95,489 వ్యాక్సిన్ డోసులు వేశారు. మొత్తంగా 16.33 కోట్ల మందికి పూర్తిగా టీకాలేశారు.

తాజా వీడియో వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/videos/