దాంపత్యం కూడ లక్ష్యమే

  • ‘వ్యధ: వ్యక్తిగత సమస్యకు పరిష్కారం

వర్తమాన సమాజంలో విడిపోతున్న యువ దంపతుల సంఖ్య పెరుగు తున్నది. కొందరు అమ్మాయిలు ఏడాది తిరకుండానే పుట్టింటికి వచ్చేస్తు న్నారు. ఇప్పటికీ ఆడపిల్లల పరిస్థితి ఆరిటాకు ముల్లు సామెతలాగే ఉంది. అరిటాకు ముల్లుమీద పడ్డా, ముల్లు అరిటాకుపై పడ్డా చిరిగేది ఆరిటాకే అంటుంటారు. అలాగే భర్తలో లోపమున్నా, భార్యలో తప్పువ్ఞన్నా, పుట్టిం టికి చేరుతున్నారు. ఈ పరిస్థితులు కన్నవారికి సంక్షిష్ట సమస్యగా మారుతోంది.

పెద్ద చదువులు చదువుకుని, గొప్ప ఉద్యోగాలు చేస్తూ, లక్షల్లో జీతాలు తీసుకుంటున్న వారుకూడ దాంపత్య జీవితాలను పాడు చేసుకుంటున్నారు. అసమర్థత, అహంకారం, అనైతిక వ్యవహారాలు, పెద్దల అనవసర జోక్యం, అత్యాసలు లాంటి అనేక అంశాలు కొత్త దంపతులకు శాపాలుగా పరిణమిస్తున్నాయి.

అనుమానం, ఉన్మాదం, డిప్రెషన్‌ తదితర మానసిక రుగ్మతల వల్ల విడి పోయేవారు కనిపిస్తున్నారు. మా అమ్మాయి మా బంధువుల అమ్మాయిల జీవి తాలను పరిశీలించిన తరువాత బాధేస్తున్నది. వారి జీవితాలను చక్కదిద్దడం ఎలాగో అర్థంకావడం లేదు. ఉన్నత పాఠశాలలో 20 ఏళ్లుగా సాంఘిక శాస్త్రం పాఠాలు చెపుతున్న నాకు ఇప్పటి పరిణామాలకు సరైన కారణాలు, పరిష్కార మార్గాలు స్పురించడంలేదు నేను, మావారు ఇద్దరం ఉపాధ్యాయులమే.

మాకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్నారు. అమ్మాయి బి.టెక్‌ పాసై చెన్నైలో ఉద్యోగం చేస్తోంది. అక్కడే మరొక కంపెనీ లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా పనిచేస్తున్న అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశాము. పెళ్లయి రెండేళ్లు పూర్తి కావస్తోంది. ఇప్పటివరకు కనీసం గర్భధారణ జరగలేదు. అతను భార్యతో అంత సఖ్యతగా ఉండరు. ప్రేమగా చూడరు. పైగా రోజంతా ఏదో ఒక సాకు చెప్పి అమ్మాయిని, మమ్మల్ని విమర్శిస్తూనే ఉంటారు. మా అమ్మాయి జీతంకూడా అతనికే ఇచ్చేసినా సంతృప్తి చెందడం లేదు. పిల్లల్ని కందా మంటే ఇంకా సంపా దించిన తరువాత చూద్దాం అంటూ దాటవేస్తుంటారు. ఈ మధ్య అనుమానం పెంచుకుని వేధించడం ప్రారంభించారు. విసిగి పోయిన అమ్మాయి రెండునెలల క్రితం మా ఇంటికి వచ్చేసింది.

ఇంటి నుంచే ఆఫీసు పని చేసుకుంటున్నది. అయినా తను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. అలాగే మా బావగారి అమ్మాయి ఎంబిఎ చదివింది. ఎంసిఎ చదివి ఓ కంపెనీలో మేనేజరుగా వ్ఞన్న అమ్బాయికి ఇచ్చి పెళ్లిచేశారు. అతనే ఆమెకు ఓ కంపెనీ మానవవనరుల అభివృద్ధి విభాగంలో ఉద్యోగం ఇప్పించాడు. ఇద్దరు హైదరా బాద్‌ లోనే ఉద్యోగాలు చేస్తున్నారు. పెళ్లయి మూడేళ్లు అయ్యింది. పిల్లలు లేరు.

పెళ్లయిన తొలి రోజు నుంచి తను భార్యను ఒక పనిమనిషిలా బానిసలా చూస్తున్నాడు. ఆఫీసునుంచి మెట్రోలో వచ్చినా లేక ఎవరైనా దింపారా లాంటి ప్రశ్నలు వేస్తుంటారు. ఆమె ఫోన్‌ పరిశీలించడం లాంటివి చేస్తుంటారు. ఆమె ఆఫీసులో పని చేస్తున్న ఒకతనితో సంబంధం అంటగట్టి వేధించడంతో గొడవ పడి ఏడాది క్రితం ఉద్యోగానికి రాజీనామ చేసి పుట్టింటికి వచ్చేసింది. ఎవరు ఎన్ని చెప్పినా అతనితో కలిసి కాపురం చేయనని భీష్మించుకున్నది. కాగా మా బంధువ్ఞల అమ్మాయి ఒకామె పరిస్థితి ఇలాగే వ్ఞంది. ఆమె డిగ్రీ మధ్యలో ఆపేసింది.

డిగ్రీ చదివి బెంగుళూరులో ఉద్యోగం చేస్తున్న అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు. అతనిలో తొలి నుంచి ఉద్యోగలోపాలు ఉన్నాయి. తొలిరాత్రి కొంత అతిగా ప్రవర్తించాడట. దీంతో అమ్మాయి భయపడి నిరాక రించి తరువాత సమ్మతించి కార్యం పూర్తికానిచ్చింది. అప్పటి నుంచి ఆమెకు లేని మానసిక రుగ్మతలు అంటగట్టి వేధించడం ప్రారంభిం చాడు. పెళ్లయి ఏడాది గడిచింది. అమ్మాయి వద్ద వ్ఞన్న నగలన్నీ లాక్కుని బలవంతగా నెలక్రితం పుట్టింటికి తరిమేశాడు. ఈ మూడు సమస్యలను విశ్లేషించి పరిష్కార మార్గాలు సూచించండి.

  • కృష్ణవేణి, అనంతపూర్‌

అమ్మా, సాంఘిక శాస్త్ర ఉపాధ్యారాలుగా పనిచేస్తున్న మీరు సామాజిక స్పృహంతో స్పందించినందుకు సంతోషం. మీరు అన్నట్టు పలు వ్యక్తి గత, మానసిక, సామాజిక అంశాలు ఇప్పటి కొత్త దంపతులకు శాపాలు గా పరిణమిస్తున్నాయి. వీూరున్నట్టు పెద్ద చదువ్ఞలు చదివి, గొప్ప ఉద్యోగాలు చేస్తున్న వారు దాంపత్య జీవితాలను పాడు చేసు కోవడం దురదృష్టకరం. దీనికి ప్రధాన కారణం వృత్తి నైపుణ్యాలు పెంచుకోవడంపై వ్ఞన్న శ్రద్ద జీవన, సామాజిక నైపుణ్యాలు పెంచుకోవడంలో లేకపోవ డమే. విద్యా సంస్థలు మార్కుల పట్ట, తల్లిదండ్రు లు ఉద్యోగా లపట్ల, యువకులు జీతాల పట్ల మోజు పెంచుకుంటున్నారు తప్ప జీవన మధుర్యా లను ఆస్వాదించలేక పోతున్నారు.

సాఫ్ట్‌వేరులో నైపుణ్యం సాధించిన కొందరు సంసారంలో సామర్థ్యం చూపలేక పోతున్నారు. మానవ వనరుల అభివృద్ధి శాస్త్రాలు చదివిన వారు దాంపత్య
వృద్ధి, కుటుంబ సమృద్ధిని గూర్చి ఆలోచించ లేకపోతున్నారు. దీనికి కారణం ఆధునిక పోకడలు, స్వార్థ ప్రయోజనంతో కూడాన లక్ష్యాల నిర్ధేశనం. అంటే గొప్పస్థాయికి ఎదగడం, సంపాదిం చటమే లక్ష్యాలుగా ఆలోచిస్తున్నారు తప్ప మానవత్వం, సమాజహిత కుటుంబ అభివృద్ధిపై దృష్టిపెట్టలేక పోతున్నారు.

అలాగే దాంపత్య జీవితంలో వ్యవహరించాల్సిన
రీతులు, పాటించాల్సిన పద్ధతులు ఇతర అంశాల పట్ల అవగాహన లేదనిపిస్తోంది. దీనికి కారణం ఇప్పటి యువతలో సాంఘిక జీవనం, సాంఘికీకరణం కొంత తక్కువ అని చెప్పాలి. కాబట్టి విద్యాసంస్థలు, సామాజిక వ్యవస్థలు వ్యక్తిత్వ నిర్మాణం పట్ల శ్రచూపాలి.ఉద్యోగాలిచ్చిన సంస్థలు వృత్తి నైపుణ్యాలతోపాటు జీవననైపుణ్యాలు, కుటుంబ ప్రాధాన్యత దాంపత్య జీవినంపై శిక్షణ ఇవ్వడం ప్రారం భించాలి. వృత్తి లక్ష్యాలు, కుటుంబ ధర్మాలను సమతుల్యం చేసుకోవడం నేర్పాలి.

మానసిక, శారీరక ఆరోగ్యంపెంపొందించుకోవడం పట్ల అవగాహన కల్పించాలి. కాగా మీ అల్లుడిలో ప్రవర్తనా లోపాలు, మీ బావ అల్లునిలో మానసిక సమస్యలు ఉన్నట్టు భావించాలి. వారిని కౌన్సెలింగ్‌ ద్వారా కలపడానికి ప్రయత్నంచండి. మీ బంధువుల అల్లుడిలో అసాంఘిక ప్రవృత్తి ఉన్నట్టు భావించి పోలీసులను ఆశ్రయించండి. అందరికీ దాంపత్యం కూడా ఉన్నత లక్ష్యమే అన్న వివేకం కల్పించండి.

-డాక్టర్‌ ఎన్‌.బి.సుధాకర్‌రెడ్డి, సైకాలజిస్టు

తాజా తెలంగాణ వార్తల కసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/