మంచి పోషకాల కరివేపాకు
ఆహారం-ఆరోగ్యం

కరివేపాకులో ప్రొటీన్లు, కాల్షియం, ఐరన్, ఎ,బి,సి, విటమిన్లు ఉంటాయి.
ఆరోగ్య పరిరక్షణలో కరివేపాకు మేలైన ముఖ్యపాత్ర పోషిస్తోంది.
దీని రెమ్మల కషాయం శరీరానికి చలువచేస్తుంది.
అన్ని వయసుల వారికి ఇది మంచిది. కరివేపాకు తింటే ఒత్తిడి తగ్గి మెదడుకు కాల్షియం సరఫరా చేసి మనసును ఎంతో హాయిగా ఉంచుతుంది.
ఒత్తిడిని తగ్గించడంలో మంచి మిత్రుడు కరివేపాకు, వేవిళ్లతో బాధపడే గర్భిణులు కరివేపాకుల రసం తీసుకుని నిమ్మరసం స్పూన్, తేనె అరస్పూన్ కలిపి తీసుకుంటే తప్పనిసరిగా వేవిళ్లు తగ్గుతాయి.
నోటిపూతతో బాధపడేవారు పచ్చి కరివేప ఆకులు ప్రతిరోజూ ఉదయాన్నే నమిలితే త్వరలో నోటి పూత తగ్గిపోతుంది.
చక్కెర వ్యాధిగ్రస్తులు ప్రతిరోజూ పరగడుపున కరివేపాకు ఒక రెబ్బ ఆకులు నమలడం మంచిది. రక్తంలో షుగర్ శాతం తగ్గుతుంది. చక్కెర వ్యాధిలో ఉండే నీరసం కూడా తగ్గుతుంది. శక్తిని కల్గిస్తుంది.
కరివేపాకు ప్రతిరోజూ తింటే నరాల బలహీనత తగ్గి బలవంతు లుగా మారతారు. ప్రతిరోజూ ముసలివారు లేత కరివేపాకు ఆకును ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవాలి.
కరివేపాకు ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఆహారంలో స్వీకరిస్తే మూత్ర సంబంధిత వ్యాధులు తొలగిపోతాయి.
దీని చెట్టువేళ్లతో కషాయం చేసి ప్రతిరోజూ నెలరోజుల పాటు తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు కరిగిపోతాయి.
నూనెలో కరివేపాకు వేసి, బాగా మరిగించి ప్రతిరోజు ఆ తైలాన్ని తలకు రాసుకుంటే క్రమక్రమంగా జుట్టు నల్లబడుతుంది.
కరివేపాకును చారులో వేసుకుని తాగితే విరేచనం సులభం అవు తుంది. కరివేపాకు ఎక్కువగా తింటే రక్తం పలుచగా మారి గుండెకు ఎంతో మేలు చేస్తుంది. కళ్లజబ్బులకు కరివేపాకు ఎంతో ఉపయోగపడుతుంది.
పంటి జబ్బులకు కూడా కరివేపాకు ఎంతో ప్రయోజనం కల్గిస్తుంది. పిల్లలకు పాలిచ్చే తల్లులు కరివేపాకు వాడితే తల్లిపాలు వృద్ధి అవుతాయి.
కరివేపాకును ప్రతిరోజూ తింటే అజీర్ణం తగ్గుతుంది.
తాజా జాతీయ వార్తల కోసం :https://www.vaartha.com/news/national/