దుమ్ములేపుతున్న ‘గుంటూరు కారం ‘ టీజర్..మహేశా..మజాకా

సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కలయికలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కి ఘాటైన టైటిల్ పెట్టడమే కాదు ఫస్ట్ లుక్ టీజర్ తో సినిమా ఫై అంచనాలు తారాస్థాయికి తీసుకెళ్లారు. అసలైన మాస్ టైటిల్ ‘గుంటూరు కారం ‘ ను ఈ సినిమా కు పెట్టి..యాక్షన్ ప్రియులను ఆకట్టుకున్నారు. టైటిల్ తో పాటు ఫస్ట్ గ్లింప్స్ వీడియో ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తోంది.

మ‌హేష్ ని ఓ భారీ ఎలివేష‌న్‌తో ప‌రిచ‌యం చేశారు. టైటిల్‌కి త‌గ్గ‌ట్టే గుంటూరు మిర్చీ యాడ్‌లో.. ఓ ఫైట్ సీక్వెన్స్‌కి ఇంట్రో లా సాగిన గ్లిమ్స్ ఇది. స‌ర్రా స‌ర్రా చూడు.. సుర్రంటుంది కారం.. ఎడా పెడా చూడం ఇది ఎర్రెక్కించే బేరం అంటూ బ్యాక్ గ్రౌండ్‌లో త‌మ‌న్ హోరెత్తిస్తుండ‌గా మ‌హేష్ ఎంట్రీ ఇచ్చాడు. ‘ఏంద‌ట్టా సూత్తున్నావ్‌.. బీడీ త్రీడీలో క‌న‌ప‌డ్తాందా..’ అంటూ బీడీ పొగ‌ల మ‌ధ్య మ‌హేష్ ఓ డైలాగ్ వ‌దిలాడు. నిమిషం నిడివి ఉన్న టీజ‌ర్ ఇది. మ‌హేష్ అభిమానుల‌కు పండ‌గ‌లా సాగిపోయింది. ఈ గ్లిమ్స్ తో, టైటిల్ తో ఈ సినిమాలో మ‌హేష్ క్యారెక్ట‌ర్ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పక‌నే చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు త్రివిక్ర‌మ్‌. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

YouTube video