ఎన్టీఆర్ ఘాట్ వద్ద దగ్గుబాటి పురందేశ్వరి భావోద్వేగం

టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు, తెలుగు ప్ర‌జ‌ల ఆరాధ్య న‌టుడు నంద‌మూరి తార‌క‌రామారావు జ‌యంతి సంద‌ర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద జయంతి వేడుకలు మొదలయ్యాయి. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఘాట్ కు చేరుకొని నివాళ్లు అర్పిస్తున్నారు. ఈ సందర్భాంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళ్లు అర్పించిన కూతురు దగ్గుబాటి పురందేశ్వరి భావోద్వేగానికి గురయ్యారు.

నందమూరి తారక రామారావు ఒక సంచలనం.. ప్రభంజనమన్నారు. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే ఏడాది మే 28 వరుకు శతజయంతి ఉత్సవాలు చేయనున్నట్లు తెలిపారు. రెండు రాష్ట్రాల్లో 12 కేంద్రాల్లో శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. శత జయంతి ఉత్సవాలు నిర్వహించటానికి ఒక కమిటీని ఏర్పాటు చేశామని అన్నారు. కమిటీలో బాలకృష్ణ, రాఘవేంద్రరావు, రాజేంద్రప్రసాద్, పరుచూరి వంటి ప్రముఖులు ఉన్నారని చెప్పారు. ఎన్టీఆర్ ఫోటోను వంద రూపాయల నాణెంపై ముద్రణ చేయాలనే ఆలోచనతో ఆర్బీఐతో మాట్లాడుతున్నామని అన్నారు.