సిబిఐ కోర్టుకు చేరుకున్న అవినాష్ రెడ్డి

మాజీ మంత్రి వివేకా హత్య కేసు దర్యాప్తు

Hyderabad: మాజీ మంత్రి వై ఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు క్రమంలో ఎంపీ అవినాష్ రెడ్డి సోమవారం సీబీఐ కోర్టుకు చేరుకున్నారు. కాగా వివేకా హత్య కేసులో అనుబంధ ఛార్జ్ షీట్ ను సిబిఐ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. గత నెల 14న కోర్టుకు హాజరు కావాలని సిబిఐ కోర్టు సమన్లు జారీ చేసింది . అవినాష్ రెడ్డి, వై ఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి పై సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన విషయం విదితమే. ఈ కేసులో 8ప నిందితుడిగా అవినాష్ రెడ్డిని సీబీఐ చేర్చిన సంగతి తెలిసిందే.

జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/category/news/national/