బిర్కూర్ బీసీ బాలుర హాస్టల్..ఐదో తరగతి విద్యార్థి మృతి

గత కొద్దీ నెలలుగా తెలంగాణలోని ప్రభుత్వ హాస్టల్స్ లలో ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వందల సంఖ్యలో హాస్పటల్ పాలవ్వడం, ఒకరు , ఇద్దరు మరణించిన ఘటనలు జరిగాయి. తాజాగా కామారెడ్డి జిల్లాలోని బిర్కూర్ బీసీ బాలుర హాస్టల్ లో సాయిరాజ్ అనే ఐదో తరగతి విద్యార్థి మరణించడం అనేక అనుమానాలకు దారితీస్తుంది. రాత్రి ఒంటి గంట సమయంలో సాయిరాజ్ కు బాగా వాంతులు కావడంతో హాస్పిటల్ కు తరలించారు. ఉదయం 5 గంటలకు సాయిరాజ్ చనిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపినట్లు చెపుతున్నారు.

పాము కరిచి చనిపోయాడని హాస్టల్ సిబ్బంది తెలిపారని సాయిరాజ్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కానీ పాము కరవడం వల్ల కాదని దీని వెనుక అనుక అనుమానాలు ఉన్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తూ హాస్టల్ వద్ద గొడవకు దిగారు. దీంతో బీసీ హాస్టల్ దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఈ ఘటన పట్ల ఆవేదన వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ జితేష్.వి పాటిల్.. వార్డెన్ సందీప్ ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. వార్డెన్ నిర్లక్ష్యం వల్ల విద్యార్థి మృతిచెందినందున అతడిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. విద్యార్థి సాయి రాజ్ మృతిపై ఉన్నతాధికారులతో విచారణ చేయిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.