రాణి ఎలిజబెత్‌-2 మృతికి గౌరవసూచకంగా రేపు సంతాప దినం

కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా సంతాప దినాన్ని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

telangana-government-announces-sep-11-as-state-mourning-to-respect-queen-elezabeth

హైదరాబాద్ః బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2 మృతికి గౌరవసూచకంగా రేపు సంతాప దినంగా పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. క్వీన్‌ ఎలిజబెత్‌-2 గురువారం మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌ 11ను సంతాప దినంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో కేంద్రం నిర్ణయానికి అనుగుణంగా సీఎస్‌ ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ పతాకాన్ని సగం వరకు కిందకు దించాలని ఆదేశించారు. ఆదివారం ఎలాంటి అధికారిక వేడుకలు నిర్వహించకూడదని వెల్లడించారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/