కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఫెయిలైన ఘటనలో 4 కు చేరిన మృతుల సంఖ్య

కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ వికటించిన ఘటనలో మృతుల సంఖ్య నాలుగు కు చేరింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నంలో చోటు చేసుకుంది. ఈ ఘటన లో ఇప్పటి వరకు మమత(25), షుష్మ(26), రాజీవ్ నగర్ తండాకు చెందిన మేరావత్ మౌనిక(25), సీతారాంపేట్ గ్రామానికి చెందిన అవుతపురం లావణ్య(25) మృతి చెందారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో ఏడుగురు చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో ICUలో చికిత్స అందిస్తున్నారు. మరోపక్క ఈరోజు ఉదయం చనిపోయిన లావణ్య కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ నెల 25న ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో 34 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. ఇందులో ఆపరేషన్లు ఫెయిలై పలువురి పరిస్థితి విషమంగా మారింది. ఈ ఘటనపై స్పందించిన ప్రభుత్వం ఇద్దరు మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పులన పరిహారం అందజేసింది. మిగిలిన 30 మందిని కూడా అపోలో హాస్పిటల్ లో తోపాటు వివిధ హాస్పిటల్స్ కు తరలించి అధికారులు మెరుగైన వైద్యం అందించే ప్రయత్నం చేస్తున్నారు.