వేసవిలో బార్లీ నీళ్లు..బోలెడు ప్రయోజనాలు !

ఆహారం, ఆరోగ్యం

Benefits of barley water


రక్తపోటును అదుపులో ఉంచుతాయి . రక్తంలో చక్కర స్థాయిలను అదుపులో ఉంచి , టైప్ డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించటంలో సహాయ పడుతుంది.. మధుమేహం ఉన్నవా రు తమ రక్తంలో స్థాయిలను నియంత్రించేందుకు బార్లీ వాటర్ తాగవచ్చు .

ఎండల ప్రభావం పడకుండా ఉండాలన్నా, వడ దెబ్బ తగలకుండా ఉండాలన్నా ఈ నీళ్లు తాగాల్సిందే.

బార్లీ నీళ్లు తాగితే జీర్ణాశయం కూడా చాలా శుభ్రపడుతుంది .. అజీర్తి దూరం అవుతుంది.

పిల్లలకు బార్లీ నీరు తాగించటం వలన మంచి ఫలితం ఉంటుంది . మలబద్దకం వంటి సమస్యలు దరి చేరవు.

Barley water is very useful for pregnant women

గర్భిణీలు రోజూ బార్లీ నీళ్లు తగితే మరీ మంచిది. కాళ్ళ వాపు సమస్య ఉండదు . ఉదయం , సాయంత్రం బార్లీ నీళ్లు తాగితే బిడ్డ ఆరోగ్యం కూడా బాగుంటుంది.. అలసట కూడా త్వరగా రాదు.

బరువు తగ్గాలనుకునేవారు , వారికి కూడా బార్లీ నీళ్లు బాగా ఉపయోగ పడతాయి. రక్తంలో కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తాయి. దీని ద్వారా గుండె సంబంధిత వ్యాధులు దూరంగా ఉంటాయి .

మహిళలను తరచూ బాధించే ప్రధాన సమస్య మూత్ర నాళ ఇన్ఫెక్షన్ .. ఈ సమస్యను దూరం చేసుకోవాలంటే, ఉదయాన్నే రోజూ గ్లాసుడు బార్లీ నీళ్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది. మూత్రంలో ఇన్ఫెక్షన్స్ కలిగే కారకాలు, వ్యర్ధాలు బయటికి పోతాయి.. సూక్షమైన రాళ్లు కూడా కరిగి పోతాయి.