యుక్తవయస్సే శాపమా?

యుక్త వయసుకు కూడా రాని పిల్లలు (12-16 సంవత్సరాల మధ్య వయసు) లైంగిక హింసకు, అత్యాచారాలకు బలవ్ఞతున్నారు. ఇలాంటి సంఘటనలన్ని నూరింట తొంభై శాతం వరకు తమ తండ్రుల చేతనో, దగ్గరి బంధువ్ఞల చేతనో జరుగుతున్నట్లు ఒక పరిశోధన నిరూపించింది. ఇందువల్ల స్త్రీ జీవితాంత శారీరక బాధలకు, మానసిక వ్యధలకు గురవ్ఞతున్నది. ఇంకా ఇటువంటి సంఘటనలు సక్రమంగా రిపోర్టు కాకపోవటం వలన ఇది తమ పెద్ద సమస్యో అర్థం కావటం లేదు.

teenage Girl
teenage Girl


టీనేజ్‌ ప్రమాదకరమైన దశ: వ్యక్తి జీవితంలో 11-19 సంవత్సరాల మధ్య వయసును కౌమార దశ లేదా టీనేజర్స్‌ అంటారు. ఈ దశలో ఆడపిల్లలు సామాన్యంగా ఆరోగ్యవంతంగా ఉంటారు. ఆడపిల్ల జీవితంలో ఈ దశ అత్యంత కీలకమైనదే కాగా, అత్యంత ప్రమాదకరమైనది కూడా. ఈ దశ తెలిసీ, తెలియని దశ. కావ్ఞన వీరు మగవరి చేతిలో మోసపోయి అనుకోకుండా గర్భవతులు అయ్యి. ఎవరికీ తెలియకుండా గర్భస్రావం చేయించుకొనే ప్రయత్నంలో వీరు ప్రమాదాలకు గురికావచ్చు. బాల్యవయసులోనే తల్లులుగా మారడం అభివృద్ధి చెందుతున్న దేశాలలో కనేవారిలో పది నుండి యాభై శాతం వరకు 19 సంవత్సరాలలోపే తొలి శిశువ్ఞను కంటున్నారు.

ప్రపంచవ్యాప్తంగా జననాల రేటు క్రమంగా తగ్గుతున్నా, యవ్వన ప్రారంభదశలో బిడ్డను కనేవారి రేటు మాత్రం తగ్గటం లేదు. చిన్న వయసులోనే బిడ్డను కనవలసి రావటం చేత, గర్భానికి సంబంధించిన కారణాల వల్ల స్త్రీ చనిపోయే అవకాశాలు అధికంగా ఉంటాయి. వీటికితోడు పత్రికలు, టి.వి.లు, సినిమాలు, సమవయస్కుల ప్రోత్సాహం వంటివి సామాజిక, నైతిక ప్రమాణాలను మార్చివేస్తున్నాయి.

పోషకాహార లోపం-ప్రాణగండానికి శాపం:

యువతి రసజ్వల అయినప్పటి నుండి ఆమెకు ఇనుము అధికంగా కావలసి ఉంటుంది. 20 సంవత్సరాలు దాటిన తర్వాత మగవారిని అయెడిన్‌ లోపం అంతగా బాధించదు. కానీ స్త్రీలకు దీని అవసరం పెరుగుతుంది. అందువల్ల పిల్లలను కనేదశలో వీరిలో అయెడిన్‌ లోపం అధికంగా కనిపిస్తుంది. ఈ పోషకాహార లోపం వల్ల (ఇనుములోపించటం) శరీర పెరుగుదల సక్రమంగా ఉండదు. పోషక పదార్థంగా ఇనుము లోపించటం వల్ల వచ్చే అనీమియాకు గురవ్ఞతున్న వారిలో 30కోట్లమంది పురుషులండగా స్త్రీలు 50 కోట్లకు మించి ఉన్నారు.

గర్భాధారణ వల్ల అంకురిస్తున్న సమస్యలు అనేకం. కౌమార దశలోని ప్రమాదాలను గడిచి గట్టెక్కగలిగితే స్త్రీకి వివాహమై మాతృత్వ దశలోకి ప్రవేశిస్తుంది. ఇది ఆవిడ జీవితంలో అత్యంత ప్రమాదకరమైన దశ. అభివృద్ధి చెందుతున్న దేశాలలో సాలుకు 15 కోట్ల మంది స్త్రీలు గర్భవతులవ్ఞతున్నట్లు అంచనా వేస్తున్నారు.

గర్భధారణ వల్ల వచ్చే సమస్యల వల్ల సాలుకు 5 లక్షల మంది మరణిస్తున్నారు. ఈ మరణాలకు ప్రధాన కారణాలు 5.

అవి 1) రక్తస్రావం

2. క్షేమకరం కానీ గర్భవిచ్చిత్తి

3. రక్తపోటువల్ల వస్తున్న కొన్ని ఇబ్బందులు

4. అంటు రోగాలు,

5. కాన్పు కష్టం కావటం. ప్రపంచంలో సాలుకు 25 కోట్ల మంది స్త్రీకు సుఖరోగాలు సోకుతున్నట్లు ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. ఈ జననాంగాలకు రోగాలు సోకటానికి ప్రధానంగా మూడుకారణాలు

  • స్త్రీలకు జననాంగ రక్షణ విషయంలో తగినంత జ్ఞానం లేదు. సెక్సుని గురించి అవసరమైనంతగా తెలియదు. – సంప్రదాయం పేరిట వస్తున్న కొన్ని విధానాలు కూడా ఈ రోగాలరాకకు కారణమవ్ఞతున్నాయి.
    సాంఘిక, సాంస్కృతిక, జీవన సంబంధమైన కారణాల వల్ల మానసిక సమస్యలు ఉత్పన్నమవ్ఞతాయి. లైంగిక హింస, అత్యాచారం, దెబ్బలు తినవలసి రావటం, సెక్సుపరమైన పీడన, సంతానం వద్దని తాపత్రయప డుతున్న కాలంలో గర్భధారణ. సంతాన ప్రాప్తి లేకపోవటం, సుఖరోగాల భయం, హెచ్‌ఐవి, ఎయిడ్స్‌ వల్ల కలిగే భయం, స్త్రీగా వివక్షను అనుభవించవలసి రావటం, కాన్పు తర్వాత వచ్చే అనారోగ్యం, మెనోపాజ్‌, వయసు ముదిరే కొద్ది వచ్చే సమస్యలు ఇవన్నీ స్త్రీలకు మానసిక రోగాలు రావటానికి కారణమవ్ఞతున్నాయి.
  • స్త్రీ శారీరరకంగా, మానసికంగా, సెక్సుపరంగా హింసించటాన్ని లైంగిక హింసగా పరిగణిస్తున్నారు. సెక్సుహింస అన్ని సమాజాలలోను కనిపిస్తుంది. ఇది ‘సర్వాంతర్యామి స్త్రీ అకాల మరణాలకు, రోగాల బారిన పడటానికి ఇదొక ముఖ్య కారణం. ప్రపంచం మొత్తం మోస్ను రోగభారంలో 5 శాతానికి అత్యాచా రాలు, లైంగిక హింస కారనమవ్ఞ తున్నాయని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది.
  • అయిన ప్పటికి సమాజాలు స్త్రీ హింసను తీవ్రమైన అంశంగా పరిగణించటం లేదు. స్త్రీ హింసను గుర్తించలేని చట్టం దానిని కొన్ని సందర్భాలలో చట్టసమ్మ తమైనది గా వదిలివేయటం కూడా కనిపిస్తుంది. స్త్రీలు తల్లి గర్భంలో పిండంగా అవ తరించినప్పటి నుండి కాటికిపోయే వరకు ప్రాణగండాలను ఎదు ర్కొంటున్నది.
  • భూదేవిలా ఓర్పు వహించి, మెనోపాజ్‌ దశలో ప్రవేశించ గలిగితే కేన్సర్‌, హృద్రో గాలు, మధుమేహం, ఎముకలు బలహీనపడటం, కీళ్లనొప్పులు, శుక్లా ల వంటి మొండి రోగాలతో బాధపడక తప్పదు. ఇది చాలదన్నట్లు కుటుం బీకుల అనాదరణ కూడా తోడైతే పోషణలోపం, మానసిక వ్యధ సంక్రమి స్తాయి. సమాజంలో పురుషునికు న్నంత హోదా స్త్రీలకు లేదు. వారికంటే వీరు తక్కువవారు. ఈ స్త్రీ, పురుష అసమానతలు సమాజంలో సగభాగంగా ఉన్న స్త్రీలను మానసిక, శారీరక బాధలకు గురిచేస్తున్నాయి.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/health1/