‘సిద్ధం’ సభలో మున్సిపల్ కార్మికుడు మృతి..

బాపట్ల జిల్లా మేదరమెట్లలో నిన్న జరిగిన ‘సిద్ధం’ సభలో ఒంగోలు మున్సిపల్ కార్మికుడు మురళీకృష్ణ (35) మృతిచెందాడు. అతని మృతి పట్ల CM జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుని కుటుంబానికి రూ.10లక్షల ఆర్థికసాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఒక గ్యాలరీ నుంచి మరో గ్యాలరీకి వెళ్తున్న క్రమంలో అతను అస్వస్థతకు గురై మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. బస్సు నుంచి జారిపడి పల్నాడుకు చెందిన మరో వ్యక్తి మరణించాడు.

ఇక ఈ సభలో జగన్ మాట్లాడుతూ..ప్రజలు మెచ్చిన పాలన అందించేందుకు జగన్‌ అనే సిద్ధం అంటూ జగన్ చెప్పుకొచ్చారు. అధికారమంటే నాకు వ్యామోహం లేదు. అధికారం పోతుందనే భయం లేదు. చెసేదే చెప్తాం. చెప్పామంటే చేస్తాన‌ని పేర్కొన్నారు. హిస్టరీ బుక్‌లో మీ బిడ్డ పేరు ఉండాలన్నదే కోరిక అని సీఎం ఉద్ఘాటించారు. మీ అన్న మాట ఇస్తే తగ్గేదే లే. మేనిఫెస్టోలో 99 శాతం హామీలు అమలు చేశాం. 2024 తర్వాత కూడా మనం చేస్తున్న మంచి కొనసాగాలి. దేవుడి మీద తప్ప మీ అన్న పొత్తులు జిత్తులు నమ్ముకోలేదు. 2019కి ముందు మీకు మంచి భవిష్యత్తు అందిస్తానని మాటిచ్చా. 99 శాతం హామీలు అమలు చేశాం.

మన సంకక్షేమ పథకాల్ని చూసి తట్టుకోలేక శ్రీలంక అయిపోతుందని ప్రచారం చేస్తున్నార‌ని త‌ప్పుప‌ట్టారు. త‌న‌పై అరడజను పార్టీలు బాణాలు ఎక్కుపెట్టాయి. బాబుకు ఓటేయడమంటే.. చంద్రముఖిని ఇంటికి తెచ్చుకోవడమే. 175కు 175 అసెంబ్లీ సీట్లు, 25 లోక్‌సభ సీట్లకు 25 సీట్లు తెచ్చుకోవడమే మన టార్గెట్‌. మన నేతలు ఇంటి ఇంటికి వెళ్లి జరిగిన మంచి చెబుతున్నారు. పేదవారి భవిష్యత్తు బాగుండాలంటే సీఎంగా జగన్‌నే తెచ్చుకోవాలని మీరంతా చెప్పండి. మీ అన్న వస్తేనే పథకాలన్నీ అందుతాయని చెప్పండి అంటూ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పార్టీ శ్రేణుల‌కు దిశానిర్దేశం చేశారు.