ప్రజారోగ్యానికి పొంచి ఉన్న ప్రమాదం

కోవిడ్‌ బాధితులకు సకాలంలో చికిత్స పరిస్థితి లేదు

Risk to public Health
Risk to public Health

ఇక్కడ ప్రజల డబ్బుతో చదివి, స్వదేశాన్ని, బంధుమిత్రులను వదిలి వేలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశాలకు చేరుకుని అక్కడి ప్రజలకు సేవ చేయాలని ఎందుకు అనుకుంటున్నారో పాలకులు ఒకసారి మనసుపెట్టి ఆలోచించాలి.

వారికి అక్కడ లభిస్తున్న సదుపాయాలు, జీతభత్యాలు మనం ఇవ్వలేకపోవడంవల్లనే అక్కడికి పోతున్నారనేది కాదన లేని వాస్తవం.

దేశ జనాభా అవసరం మేరకు కనీసం వైద్యసేవలు అందించాలంటే.. మరో ఐదారు లక్షల మంది అర్హత కలిగిన డాక్టర్ల అవసరం ఉంది.

ఇక మందుల విషయంలో ఏమేరకు కేటాయిస్తున్నారో ఒక్కసారి పరిశీలించుకోవాలి. ఇన్ని లోపాలు పెట్టుకుని వైద్య ఆరోగ్య వ్యవస్థ కొట్టుమిట్టాడుతున్న తరుణంలో కరోనా వైరస్‌ ప్రజారోగ్యంపై దాడి చేస్తున్నది.

ఇప్పటికైనా పాలకులు క్షేత్రస్థాయిలో వాస్తవికతను దృష్టిలో ఉంచుకుని వైద్యవిద్యారంగానికి అవసరమైన ప్రాధాన్యత ఇవ్వాలి.

‘అ ప్పిచ్చువాడు వైద్యుడు.. ఎప్పుడు ఎడతెగక పారు ఏరు..లాంటి వసతులున్న చోటునే నివాసానికి ఎంపిక చేసుకోవాలని సుమతీ శతకారుడు ఏనాడో చెప్పారు. వైద్యానికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఇంతకుమించిన ఉదాహరణ వేరే చెప్పనవసరం లేదు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి వైద్య రంగానికి అంతగా ప్రాముఖ్యత ఇవ్వలేదనే చెప్పొచ్చు.

అవసరానికి అనుగుణంగా పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకుని కనీస వైద్యసదుపాయాలను అందించే దిశలో పాలకులు అడుగులు వేయలేదనే విషయం గత ఏడు దశాబ్దాలుగా అటు కేంద్రపాలకు కాని, ఇటు రాష్ట్ర పాలకులుకాని వైద్యరంగానికి కేటాయించిన నిధులే వెల్లడిస్తున్నాయి.

అలా అని ఏమీచేయలేదని చెప్పడం లేదు. ప్రజారోగ్యంకోసం దేశవ్యాప్తంగా కోట్లాదిరూపాయలు ఖర్చు పెట్టారు, పెడుతున్నారు.

డాక్టర్లు, సిబ్బంది ప్రజారోగ్యాన్ని కాపా డేందుకు కృషిచేస్తున్న మాటకూడా కొంత వాస్తవమే. కానీ పెరుగు తున్న రోగాలు, జనాభాకు అనుగుణంగా అది సరిపోవడం లేదనే విషయం పాలకులకు కూడా తెలియని కాదు.

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం అందులో భారత్‌లో ఆలస్యంగానైనా విజృంభించడంతో పాలకుల అసమర్ధత కొట్టొచ్చి నట్లుగా కనిపిస్తున్నది. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని కాదు.

అటో ఇటో దేశమంతా అదే పరిస్థితి. ఎయిడ్స్‌, కేన్సర్‌, క్షయ, మెదడు వ్యాపు, స్క్వైన్‌ఫ్లూ, డెంగ్యూలాంటి వ్యాధులు కోరలు చాచి విజృంభిస్తూనే ఉన్నాయి.

వాతావరణంలో మార్పులు వచ్చినప్పు డల్లా ఈ వ్యాధులు ప్రజారోగ్యంపై దాడి చేస్తూనే ఉన్నాయి.

ఎన్ని ఆసుపత్రులు నిర్మించినా, సిబ్బంది సంఖ్యను పెంచి లక్ష లాది కోట్లు వెచ్చిస్తున్నామని అటు కేంద్ర పెద్దలు, ఇటు రాష్ట్ర పాలకులు ఎంతగా చెబుతున్నా.. ఆశించినమేరకు లక్ష్యాలు సాధిం చ లేకపోతున్నారు.

వ్యాధులను అదుపు చేయడంలో పాలక పెద్దలు విఫలమవ్ఞతూనే ఉన్నారు.

తాజాగా గత నాలుగు నెలలుగా కరోనా వైరస్‌ను నియంత్రించడంలోకాని, చివరకు కరోనా సోకినవారికి కనీస వైద్యం అందించి ఆదుకోవడంలో డొల్లతనం చెప్పకనే చెపుతున్నది. అవసరం మేరకు పడకలు లేవు, సిబ్బంది లేరు, మందులు లేవు.

. చివరకు రోగ నిర్ధారణ పరీక్షలు కూడా సమయానికి చేయలేని నిస్సహాయ స్థితి. ఉదాహరణకు మెడికల్‌ హబ్‌గా దేశంలోనే గుర్తింపు తెచ్చుకున్న హైదరాబాద్‌ పరిస్థితినే తీసుకుందాం.

కొవిడ్‌ రోగులకు సకాలం లో చికిత్స అందించే పరిస్థితులు లేవు. వ్యాధిబారిన పడినవారు చికిత్స సంగతి దేవ్ఞడెరుగు రోగ నిర్ధారణకు అవసరమైన పరీక్షలు కూడా చేయించుకోవడం గగనమైపోతున్నది.

హైదరాబాద్‌లో మరో మూడు నాలుగు రోజులపాటు నమూనాలు సేకరించలేమని ప్రైవేటు ల్యాబ్‌లు ప్రకటించాయి. పడక కావాలన్నా పరీక్షలు చేయించుకోవాలన్నా ముందుగా రిజర్వు చేయించుకోవాలని కొన్ని ఆసుపత్రుల యాజమాన్యాలు సూచిస్తున్నాయి.

హైదరాబాద్‌లో కొవిడ్‌ చికిత్సలు అందిస్తున్న దాదాపు 25 కార్పొరేటు ఆసుపత్రు లలో కొవిడ్‌కోసం రెండు వేల పడకలు కూడా లేవు.

వాస్తవానికి ఆ ఆసుపత్రుల్లో దాదాపు పదిహేను వేల వరకూ పడకలు ఉన్నా కొవిడ్‌ బాధతులకోసం కేవలం రెండు, మూడు వేలు పడకలు కూడా కేటాయించలేకపోతున్నారు. అందుకు వారికి ఉన్న ఇబ్బం దులు వారికి ఉన్నాయి.

ప్రభుత్వాసుపత్రుల్లో ముఖ్యంగా గాంధీ ఆసుపత్రిలో కొవిడ్‌ చికిత్సకు కేంద్రంగా మారినా సిబ్బంది కొరత తీవ్రంగానే ఉంది. కరోనాపై చేస్తున్న యుద్ధంలో ముందువరుస లో ఉన్న డాక్టర్లకు, ఇతర వైద్యసిబ్బంది ఈ వైరస్‌ రక్కసి వదలి పెట్టడం లేదు.

దీంతో డాక్టర్లు కూడా వెనుకా ముందూ ఆలోచిం చాల్సిన పరిస్థితి ఏర్పడింది. చికిత్స అందక ప్రాణాలు కోల్పో తున్న కొవిడ్‌ బాధితుల వేదన అరణ్యరోదనగానే మిగిలిపోతు న్నది.

మొన్న చెస్ట్‌ ఆసుపత్రిలో శ్వాస ఆడడం లేదని, ఆక్సిజన్‌ పెట్టడం లేదని ఒక యువకుడు వాట్సాప్‌ వీడియోద్వారా తన తండ్రికి తెలియజేసిన మరుగంటలో ప్రాణం వదిలాడు.

హైదరాబాద్‌ శివారులోని ఒక ఇంజనీర్‌ శ్వాసకోశ సమస్యతో సమీపంలోని ఏ ఆసుపత్రులకు వెళ్లినా చేర్చుకునేందుకు నిరాక రించారు. తర్వాత కార్పొరేట్‌ ఆసుపత్రుల చుట్టూ తిరిగాడు.

ఒకటి కాదు, రెండు కాదు అర డజను ఆసుపత్రుల మెట్లు ఎక్కి, ప్రాణాలను కాపాడాలంటూ ప్రాధేయపడ్డాడు. చివరకు తిరిగి తిరిగి ఉస్మానియా జనరల్‌ ఆసుపత్రిలో చేరుకోవడంతో అక్కడ చికిత్స అందిస్తుండగానే ప్రాణాలు వదిలాడు. గుండెను పిండిచేసే హృద య విదారకరమైన ఇలాంటి సంఘటనలు దేశంలో కోకొల్లలుగా జరుగుతున్నాయి.

మరొకపక్క కొవిడ్‌ బాధితులకు చికిత్సలకు లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. ఒక కార్పొరేట్‌ ఆసు పత్రి ప్యాకేజీ కూడా ప్రకటించింది.

ఈ వైరస్‌ తాకిన రోగికి చికిత్స అందించేందుకు ఏకంగా పదిహేడు లక్షల రూపాయల ప్యాకేజీని ప్రకటించింది. బీదా బిక్కే కాదు.. మధ్యతరగతి ప్రజలు కూడా అటు కన్నెత్తి చూడలేని పరిస్థితి దాపురించాయి.

మెడికల్‌ హబ్‌గా పేరొందిన హైదరాబాద్‌లాంటి నగరంలోనే ఈ పరిస్థితి ఉంటే.. దేశంలోని మారుమూల గ్రామాల్లో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలలో ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

గ్రామాల్లోనే కాదు మండల కేంద్రాల్లో, దేశంలోని అనేక నగరాల్లోసైతం ప్రభు త్వ వైద్యశాలలోని డాక్టర్లు అందుబాటులో ఉండడం లేదు. ఆసు పత్రుల్లో అవసరం మేరకు సిబ్బంది ఉండరు. డాక్టర్లు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో తెలియని పరిస్థితి.

ఒకవేళ వారంతా ఉన్నా.. మందులుండవు. ప్రాణాపాయం నుండి కాపాడే అత్య వసర మందులు సరేసరి.

కనీసం పెన్సిలిన్‌లాంటి మామూలు మందులు కూడా కొన్ని ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండడం లేదు. బయటికి వెళ్లి కొని తెచ్చుకోమని చీటీలు రాసివ్వడం పరి పాటిగా మారిపోయింది.

దీనికితోడు ప్రభుత్వాసుపత్రుల్లో ఇచ్చే మందులు వాడితే పనిచేయవని రోగాలు తగ్గవని అనుమానాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.

ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న మందుల విషయంలో జరుగుతున్న అవకతవకలు, అవినీతిపై వస్తున్న ఆరోపణలు కొట్టివేయలేం. కార్మికులు సరఫరా చేసిన మందుల్లో కోట్లాది రూపాయల కుంభకోణం వెలుగుచూసింది.

ఇందుకు సంబంధించి సీనియర్‌ అధికారులు కొందరు కటకటాల పాలైనారు. దారిద్య్రరేఖకు దిగువనున్న కోట్లాది కుటుంబాలకు ఈ వైద్యం అందుబాటులో లేదనే చెప్పచ్చు. గ్రామీణ భారతాన్ని అనా రోగ్యం పట్టిపీడిస్తున్నది. గ్రామాల్లో వచ్చీరాని వైద్యం డాక్టర్లుగా చెలామణీ అవ్ఞతూ సమస్యను మరింత పెంచుతున్నారు.

ఆసుపత్రుల్లో అటెండర్లుగా, వార్డుబా§్‌ులుగా పనిచేస్తున్నవారు, చివర కు స్వీపర్లుగా పనిచేస్తున్నవారు గ్రామాల్లో డాక్టర్లుగా బాహాటంగా బోర్డుపెట్టుకుని వైద్యులుగా చలామణీ అవుతున్నారు.

కనీసం మందుల పేర్లుకూడా స్పష్టంగా రాయలేనివారు కూడా ఈ డాక్టర్ల జాబితాలో చేరిపోతున్నారు. చిన్నచిన్న ఆపరేషన్ల చేయడానికి కూడా వెనుకాడడం లేదు. ఇలాంటివారు కొందరు కొన్ని కార్పొ రేటు ఆసుపత్రులకు, ప్రజలకు మధ్య దళారులుగా వ్యవరిస్తు న్నారు.

ఎలాంటి అర్హతా లేని ఇలాంటి వైద్యులు చేసే చికిత్సతో కొన్ని సందర్భాల్లో రోగులప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈ పరిస్థితి దేశవ్యాప్తంగా అంతకంతకూ పెరిగిపోతుండడం ఆందోళన కలిగించే అంశం.

ప్రపంచ ఆరోగ్యసంస్థ గతంలో విడుదల చేసిన నివేదిక ప్రకారం అల్లోపతి వైద్యం చేసేవారిలో 57శాతం పైగా ఎటువంటి విద్యార్హతలు లేవనే విషయం బయటపడింది.

అలాగే అల్లోపతితోపాటు హోమియోపతి, ఆయుర్వేదం, యునానీ, సిద్ధ, యోగా తదితర ధానాలతో కలిపి భారతదేశంలో లక్షమంది జనా భాకు కేవలం 80మంది మాత్రమే ఉన్నారు.

వారిలో సంబంధిత పట్టా కలిగిన అర్హులు లక్షకు 36మంది మాత్రమే. ప్రమాణాల ప్ర కారం వైద్యులు రోగుల నిష్పత్తి ప్రతి వెయ్యిమందికి ఒక డాక్టరుండాలి.

కానీ మన దేశంలో 1,16,074 మందికి ఒక డాక్టరున్నా డు. ప్రతి యేడాది దేశవ్యాప్తంగా 60వేల మందికి పైగా ఎంబిబి ఎస్‌ పట్టాలతో డాక్టర్లుగా బయటికి వస్తున్నారు. ఇందులో అధిక శాతం మంది ప్రైవేటు విద్యాకళాశాలలో చదివినవారే.

భారీగా రుసుం చెల్లించి, ఇతర ఖర్చులు పెట్టి డిగ్రీలు పొందినవారే. ప్రభుత్వరంగంలోకాని, గ్రామీణ ప్రాంతాల్లోకాని పనిచేయడానికి వారు అంతగా ఇష్టపడడం లేదు.

20శాతానికిపైగా డాక్టర్లు, స్పెషలిస్టులు విదేశాలకు వెళ్లిపోతున్నారు. అక్కడ తమ నైపుణ్య తను మరింతగా పెంచుకుని, అక్కడే స్థిరపడేందుకు ప్రయత్నా లు చేసుకుంటున్నారు.

ఇక్కడ ప్రజల డబ్బుతో చదివి, స్వదేశా న్ని, బంధుమిత్రులను వదిలి వేలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశాలకు చేరుకుని అక్కడి ప్రజలకు సేవచేయాలని ఎందు కనుకుంటున్నారో పాలకులు ఒకసారి మనసుపెట్టి ఆలోచించాలి.

వారికి అక్కడ లభిస్తున్న సదుపాయాలు, జీతభత్యాలు మనం ఇవ్వలేకపోవడంవల్లనే అక్కడికి పోతున్నారనేది కాదనలేని వాస్త వం.

దేశ జనాభా అవసరం మేరకు కనీసం వైద్య సేవలందిం చాలంటే మరో ఐదారు లక్షల మంది అర్హత కలిగిన డాక్టర్ల అవసరం ఉంది. ఇక మందుల విషయం లో ఏమేరకు కేటాయిస్తున్నారో ఒక్కసారి పరిశీలించుకోవాలి.

ఇన్ని లోపాలు పెట్టుకుని వైద్యఆరోగ్యవ్యవస్థ కొట్టుమిట్టాడుతున్న తరుణంలో కరోనా వైరస్‌ ప్రజారోగ్యంపై దాడిచేస్తున్నది.

ఇప్పటికైనా పాల కులు క్షేత్రస్థాయిలో వాస్తవికతను దృష్టిలో ఉంచుకుని వైద్య విద్యారంగానికి అవసరమైన ప్రాధాన్యతనివ్వాలి.

ఇలాంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు చప్పట్లు, దీపాలతో హడావుడిచేస్తే ఏమీ ప్రయో జనం ఉండదనే విషయాన్ని పాలకులు విస్మరించరాదు.

  • దామెర్ల సాయిబాబ

తాజా సినిమా వార్తల కోసం:https://www.vaart ha.com/news/movies/