బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం : నలుగురు అయ్యప్ప భక్తుల మృతి

బాపట్ల జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు అయ్యప్ప భక్తుల మృతి చెందగా , మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వేమూరు మండలం జంపని వద్ద అయ్యప్ప భక్తులతో వెళ్తున్న టాటా ఏస్ వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కృష్ణా జిల్లా నిలపూడి గ్రామానికి చెందిన బొలిశెట్టి పాండురంగారావు (40), పాశం రమేశ్ (55), బోదిన రమేశ్ (42), బుద్దన పవన్ కుమార్ (25) లు మృతి చెందగా , మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ఘటన ఫై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. శబరిమల నుంచి వచ్చిన వీరంతా ట్రెయిన్‌లో తెనాలి స్టేషన్లో దిగారు. అక్కడి నుంచి బయలుదేరగా మంచు కారణంగా ప్రమాదం జరిగిందిం. మొత్తం 22 మంది ఆటోలో ప్రయాణిస్తున్నారు.