ప్రధాని మోడికి పుతిన్‌ శుభాకాంక్షలు

ప్రధాని మోడికి  పుతిన్‌ శుభాకాంక్షలు
Modi with Putin

న్యూఢిల్లీ: నేడు ప్రధాని నరేంద్రమోడి 70వ పుట్టిన రోజు ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెబుతూ సందేశం పంపించారు. ప్రధాని మోడి ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని, అన్నింటా విజయం వరించాలని ఆకాంక్షించారు. ఇరుదేశాల సత్సంబంధాలు భవిష్యత్తుల్లోనూ కొనసాగాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

ప్రధాని మోడికి పుతిన్ సందేశం:
గౌరవీనయులైన ప్రధాని మంత్రి గారు, 70వ పుట్టిన రోజు సందర్భంగా నా హృదయ పూర్వక అభినందనలు. ప్రభుత్వాధినేతగా భారత దేశానికి మీరు చేస్తున్న సేవకు గాను స్వదేశంతో పాటు అత్యున్నత అంతర్జాతీయ ఖ్యాతిని గడించారు. మీ సారథ్యంలో సామాజిక ఆర్థిక, శాస్త్రీయ, సాంకేతిక రంగాల్లో అభివృద్ధి దిశగా భారత్ పురోగమిస్తోంది. మన రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో మీరు అందించిన తోడ్పాటు వెలకట్టలేనిది. రష్యా, ఇండియా మధ్య ఉన్న స్వేహబంధానికి నేను ఎంతో విలువ ఇస్తాను. అంతర్జాతీయ వ్యవహారాలు, ద్వైపాక్షిక అంశాల్లో నిర్మాణాత్మక చర్చలతో పాటు కలిసి పనిచేయడాన్ని భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని ఆకాంక్షిస్తున్నా. మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని, అన్నింటా విజయం వరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.

ఇట్లు,వి. పుతిన్,
రష్యా అధ్యక్షుడు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/