జల దిగ్భందంలో 30 గ్రామాలు
లంక గ్రామాల్లో పరిస్థితి దారుణం

Kakinada: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో లంక గ్రామాల్లో పరిస్థితి దారుణంగా ఉంది.
లంక గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతలకు తరలి వెళుతున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరి ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది.
దీంతో అధికారులు 17 లక్షల 90వేల క్యూసెక్కుల నీటిని ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు.
కోనసీమలో ఉన్న లంక గ్రామాలన్నీ జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. చాలా ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.
జలదిగ్భందంలో చిక్కుకున్న ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
తాజా క్రీడా వార్తల కోసం:https://www.vaartha.com/news/sports/