జూలై నెలలో 14 రోజులు బ్యాంకులు బంద్

మరో వారం రోజుల్లో జూన్ నెల పూర్తి అయ్యి జులై నెల మొదలుకాబోతుంది. ఈ క్రమంలో జులై నెలలో ఎన్ని రోజులు బ్యాంకులు ఓపెన్ గా ఉంటాయి..ఎన్ని రోజులు క్లోజ్ అవుతాయి అనేది తెలుసుకోవాలని చాలామంది బ్యాంకు ఖాతాదారులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో జులై నెలలో దాదాపు 14 రోజుల పాటు బ్యాంకులు బంద్ అవనున్నాయి.

ఆ వివరాలు చూస్తే..

జులై 2 – ఆదివారం
జులై 5 – గురు హర్‌గోవింద్ సింగ్ జయంతి కారణంగా జమ్మూ, శ్రీనగర్‌లో బ్యాంకులకు సెలవు
జులై 6 – MHIP డే కారణంగా మిజోరంలో బ్యాంకులు క్లోజ్
జులై 8 – రెండో శనివారం
జులై 9 – ఆదివారం
జులై 11- కెర్ పూజ కారణంగా త్రిపుర లో క్లోజ్
జులై 13- భాను జయంతి కారణంగా సిక్కిం లో బ్యాంకులు క్లోజ్
జులై 16- ఆదివారం
జులై 17- U తిరోట్ సింగ్ డే కారణంగా మేఘాలయ లో బ్యాంకులు పని చేయవు
జులై 22- నాలుగో శనివారం
జులై 23- ఆదివారం
జులై 29- మొహర్రం
జులై 30- ఆదివారం
జులై 31- Martyrdom Day కారణంగా హరియాణా, పంజాబ్ లో సెలవు