త్వ‌రలోనే రెండో విడ‌త గొర్రెల పంపిణీ: సీఎం

రెండో విడ‌త గొర్రెల పంపిణీకి రూ. 6 వేల కోట్లు : కేసీఆర్

హైదరాబాద్ : సీఎం కెసిఆర్ రెండో విడ‌త గొర్రెల పంపిణీపై ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో మంత్రులు హ‌రీష్ రావు, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ.. రెండో విడ‌త గొర్రెల పంపిణీ కార్య‌క్ర‌మాన్ని త్వ‌రలోనే చేప‌ట్టాల‌ని మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, అధికారుల‌ను ఆదేశించారు. ఇప్ప‌టికే మొద‌టి విడ‌త ద్వారా రూ. 5 వేల కోట్లతో గొర్రెల పంపిణీ చేప‌ట్ట‌గా.. అద్భుత‌మైన ఫ‌లితాల‌ను ఇచ్చింద‌న్నారు.

రెండో విడ‌త గొర్రెల పంపిణీ కోసం రూ. 6 వేల కోట్లు కేటాయిస్తున్న‌ట్లు సీఎం తెలిపారు. ఈ నిధుల‌ను స‌మ‌కూర్చాల‌ని ఆర్థిక శాఖ‌ను కేసీఆర్ ఆదేశించారు. ప్ర‌స్తుతం కొన‌సాగిస్తున్న గొర్రెల యూనిట్‌ను అదే సంఖ్య‌తో కొన‌సాగించాల‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. దాంతో పాటు యూనిట్ (20+1) ధరను పెంచాలని సీఎం నిర్ణయించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/