చంద్రబాబు అరెస్ట్ తో ఇంట్లో వినాయక చవితి వేడుకలు కూడా జరుపుకోలేదు – బండ్ల గణేష్

టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ చేయడం ఎంతో బాధేసిందని, చంద్రబాబు జాతీయ సంపద అని, ఆయనను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని , చంద్రబాబు పేరు చెప్పుకుని ఎంతో మంది బాగుపడ్డారని నిర్మాత బండ్ల గణేష్ కీలక వ్యాఖ్యలు చేసారు.

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు ను గత శనివారం అరెస్ట్ చేసి , జైల్లో వేసిన సంగతి తెలిసిందే. దాదాపు 10 రోజులు అవుతున్న ఇంకా ఆయనకు బెయిల్ రాలేదు. ఈరోజు ఏపీ హైకోర్టు లో చంద్రబాబు బెయిల్ ఫై విచారణ జరగనుంది. ఇదిలా ఉంటె చంద్రబాబు అరెస్ట్ ఫై యావత్ ప్రజానీకం ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్ల పైకి వస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు చంద్రబాబు కు సంఘీభావం తెలుపుతూ వస్తున్నారు. ఇక టాలీవుడ్ ప్రముఖులు సైతం మెల్ల మెల్లగా బయటకు వస్తూ వారి మద్దతును తెలుపుతున్నారు.

తాజాగా ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ చంద్రబాబు కు మద్దతు తెలిపారు. చంద్రబాబు జాతీయ సంపద అని, ఆయనను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. చంద్రబాబు పేరు చెప్పుకుని ఎంతో మంది బాగుపడ్డారని చెప్పుకొచ్చారు. బాబు అరెస్ట్ తనను ఎంతగానో బాధించిందని, అయన అరెస్ట్ నేపథ్యంలో తాను తన ఇంట్లో వినాయక చవితి వేడుకలను కూడా జరుపుకోలేదని తెలిపారు. ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు ఎంతో కృషి చేశారని… ఐటీ ఉద్యోగులు నెల రోజుల పాటు ఉద్యోగాలు మానేసి, సొంతూళ్లకు వెళ్లి ధర్నాల్లో పాల్గొనాలని బండ్ల గణేశ్ అన్నారు. హైదరాబాద్ లో పార్కుల ముందు, రోడ్లపై కాకుండా… సొంతూళ్లలో బొడ్రాయి ముందు కూర్చోని ధర్నాలు చేయాలని సూచించారు. చంద్రబాబు జైల్లో ఇబ్బంది పడుతుంటే… తనకు ఆహారం కూడా తీసుకోవాలనిపించడం లేదని అన్నారు. అంతే కాదు రాబోయే ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాదించబోతుందని జోస్యం చెప్పారు.