సెల్ఫి దిగడానికి వెళ్లి కొట్టుకుపోయిన తల్లీ కొడుకు

చిత్తూరు జిల్లాలో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. చిత్తూరు జిల్లాలో నేడు ఒక్క రోజే 3 ప్రమాదాలు జరిగాయి. కొండపల్లి వాగులో తండ్రీ కూతురు కొట్టుకుపోయారు. కూతురు మృతదేహం దొరకగా తండ్రి మృతదేహం కోసం గాలిస్తున్నారు. ప్రమాద సమయంలో కారులో 5 మంది ఉన్నారు. పలమనేరులోని కౌండిన్య నదిలో జరిగిన ప్రమాదంలో తల్లి కొడుకు కొట్టుకుపోయారు.

Dead

సేల్ఫీ దిగడానికి తల్లి కొడుకు వచ్చారు అని పోలీసులు చెప్పారు. మరో ప్రమాదంలో నలుగురు యువకులు కారులో నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. దీనితో జిల్లాలో విషాద చాయలు అలముకున్నాయి. వరదలు వస్తున్నా సరే పలువురు మాత్రం జాగ్రత్తగా ఉండటం లేదు. గల్లంతు అయిన వారు కోసం అధికారులు గాలిస్తున్నారు. ఇక చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి.