పేపర్ లీక్ ఘటన : నవీన్ ఫ్యామిలీ కి కేటీఆర్ భరోసా

ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనల నేపథ్యంలో గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు TSPSC ప్రకటించడం తో మనస్థాపానికి గురై సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్ కు చెందిన చిటికెన నవీన్ (32) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. నవీన్ తండ్రి నాగభూషణంతో ఆయన ఫోన్ లో మాట్లాడారు. అండగా ఉంటామని, అధైర్యపడొద్దని నవీన్ కుమార్ తల్లిదండ్రులకు కేటీఆర్ భరోసానిచ్చారు. అర్ధాంతరంగా తనువు చాలించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. నవీన్ అంత్యక్రియలకు దగ్గరుండి ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్ కు చెందిన చిటికెన నవీన్ (32) అనే యువకుడు గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షను TSPSC రద్దు చేయడం తో మనస్థాపానికి గురయ్యాడు. ఉద్యోగం లేదని, అన్ని ఉద్యోగాలకు కూడా అనర్హుడుని అవుతున్నానని మనస్తపంతో ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు ఎవరూ కారణం కాదని నవీన్ సూసైడ్ నోట్ కూడా రాశాడు. ఆరేళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న తనకు గ్రూప్–1 పరీక్ష రద్దు కావడంతో ‌నిరాశ కలిగిందని..ఇక ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదని.. జీవితం‌పై విరక్తి వచ్చిందని సూసైడ్ లెటర్ లో రాసుకొచ్చాడు. చిటికెన నాగభూషణం, సుశీల దంపతులకు ముగ్గురు కుమారులు. వారిలో నవీన్ కుమార్ చిన్నవాడు. సాఫ్ట్ వేర్‌ ఇంజనీర్‌ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూనే.. ప్రభుత్వ ఉద్యోగం కోసం గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతున్నాడు. లీకేజీ వ్యవహారంతో ఆవేదనకు గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు.