గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌కు అస్వస్థత

ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తరలింపు
గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స

హైదరాబాద్‌: ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయనను ప్రత్యేక విమానంలో విజయవాడ నుంచి హైదరాబాద్‌కు తరలించారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. గవర్నర్ అస్వస్థతకు కారణాలు తెలియరాలేదు. కాసేపట్లో గవర్నర్ ఆరోగ్యానికి సంబంధించి ఆసుపత్రి నుంచి బులెటిన్ విడుదలయ్యే అవకాశం ఉంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/