రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు పర్యటించనున్న తరుణ్‌ చుగ్‌

tarun-chugh-fires-on-kcr

హైదరాబాద్ః తెలంగాణలో నాలుగు రోజులపాటు బిజెపి ఇంచార్జ్ తరుణ్ చుగ్ పర్యటించనున్నారు. ఉమ్మడి జిల్లాలవారీగా బిజెపి బలోపేతానికి ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలపై సమీక్ష చేయనున్నారు. సెప్టెంబరు 17 న నిర్వహించే బహిరంగ సభపై రాష్ట్ర ముఖ్య నేతలతో ఆయన చర్చించనున్నారు.

ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఈటల రాజేందర్ ను తరుణ్ చుగ్ పరామార్శించనున్నారు. ఆ తర్వాత జనగామలోని రఘునాథపల్లెలో పార్టీ కార్యకర్త ఇంట్లో టీ తాగుతారు. అక్కడి నుంచి బిజెపి స్టేట్ ఆఫీసుకు వెళ్లి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలతో సమావేశమై పార్టీ బలోపేతానికి చేపట్టిన కార్యక్రమాలపై చర్చించనున్నారు. ఆదివారం ఉమ్మడి మెదక్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి అదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలతో సమావేశంకానున్నారు. సోమవారం ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం సహా హైదరాబాద్ నేతలతో సమీక్ష చేయనున్నారు. మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో భేటీ కానున్న చుగ్ అదేరోజు తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/