టిఆర్ఎస్ ఫై తరుణ్ చుగ్ చురకలు

తెలంగాణ ప్రభుత్వాన్ని నడుపుతున్నది కేసీఆర్ కాదని, కేటీఆర్, హరీష్, కవిత నడుపుతున్నారని అన్నారు బీజేపీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్. ప్రస్తుతం హైదరాబాద్ లో బిజెపి జాతీయ కార్య నిర్వహణ సమావేశాలు రేపటి నుండి మొదలుకాబోతున్నాయి. రేపు , ఎల్లుండి జరగబోయే ఈ సమావేశాలు బిజెపి అగ్ర నేతలు హాజరుకాబోతున్నారు. ఇప్పటికే అంత హైదరాబాద్ కు చేరుకున్నారు. రేపు ప్రధాని మోడీ రానున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ ప్రభుత్వంపై బీజేపీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల హామీల అమలులో కేసీఆర్ సర్కార్ విఫలమైందని, తెలంగాణ ప్రభుత్వాన్ని నడుపుతున్నది కేసీఆర్ కాదని, కేటీఆర్, హరీష్, కవిత నడుపుతున్నారని విమర్శించారు. స్వాతంత్ర్యం రాకముందు నిజాం హయంలో జరిగిన అత్యాచారాలు, సజీవ దహనాలు తెలంగాణ ప్రభుత్వ హయాంలో జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసారు. దేశంలో‌ సచివాలయానికి రాని ముఖ్యమంత్రి ఒక్క కేసీఆర్ మాత్రమే అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు ప్రధాని మోదీ, బీజేపీని చాలా ఇష్టపడతారు. 520 రోజుల తరువాత తెలంగాణాకు కుటుంబ, అవినీతి పాలన నుంచి విముక్తి లభిస్తుందన్నారు.