జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ బండి సంజయ్

ఏపీ ప్రభుత్వం ఫై జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేసారు. మందుబాబులను సైతం తాకట్టు పెట్టి అప్పులు చేస్తున్న రాష్ట్రం ఏపీ అని అన్నారు బండి సంజయ్. రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చిన జగన్ మద్యం బాండ్లు రిలీజ్ చేస్తారా అని బండి సంజయ్ ప్రశ్నించారు. మద్య నిషేదం ఎందుకు అమలు చేయలేదని జగన్ ను ఆయన ప్రశ్నించారు. మద్యం పై జగన్ ప్రభుత్వం చెబుతున్న మాటలకు చేస్తున్న పనులకు పొంతన లేదని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో మద్య పాన నిషేధంపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ప్రజలు హర్షించలేని స్థితికి వైస్సార్సీపీ పార్టీ ప్రభుత్వం పడిపోయిందని వ్యాఖ్యానించారు. అవినీతిలో, అప్పుల్లో, అరాచకాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయని బండి సంజయ్ అన్నారు. దొంగ ఓట్లతో మళ్లీ గెలిచేందుకు జగన్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో వైస్సార్సీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదనే భావన ప్రజల్లో ఉందని , అయినా మళ్లీ అధికారంలోకి రావాలని పార్టీ అడ్డదారులు తొక్కుతోందని సంజయ్ ఆరోపించారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 10 వేల ఓట్లకు పైగా నకిలీ ఓట్లను నమోదు చేసే పనిలో నిమగ్నమైందని బండి సంజయ్ అన్నారు.