సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం

బిఆర్ఎస్ అధినేత , తెలంగాణ సీఎం కేసీఆర్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఎవరికీ అర్ధం కాదు. రాజకీయాల్లో ఎలాంటి సమయాల్లో..ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో కేసీఆర్ కు తెలిసినంత మరొకరికి తెలియదనే చెప్పాలి. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నేడు 115 మందితో కూడిన మొదటి విడత ను లిస్ట్ ను ప్రకటించారు. ఈ లిస్ట్ లో ఎక్కువ సంఖ్యలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే చోటు దక్కించి సంబరాలు నింపారు.

కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ దిశగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన తాండూరు నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి తిరిగి సీటు కేటాయించారు. ఈ సీటు కోసం ప్రయత్నించిన పట్నం మహేందర్ రెడ్డికి సీఎం కేసీఆర్ నుంచి కీలక హామీ దక్కినట్లు సమాచారం.

ఎమ్మెల్సీగా ఉన్న పట్నం మహేందర్ రెడ్డి, ఆయన సతీమణి వికారాబాద్ జెడ్పీ ఛైర్ పర్సన్ గా ఉన్న సునీతా మహేందర్ రెడ్డి, అనుచర వర్గానికి సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస సిద్దమైంది. ఆ సమయంలో మంత్రి కేటీఆర్ స్వయంగా పట్నంతో చర్చలు చేసారు. ఆయనకు ప్రస్తుతం మంత్రి పదవి ఇవ్వటంతో పాటుగా, పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా కొనసాగించేలా హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ ఒప్పందం మేరకు ఇప్పుడు పట్నం మహేందర్ రెడ్డికి మరోసారి మంత్రిగా అవకాశం దక్కనుంది.