గాండీవధారి అర్జున యాక్షన్ ట్రైలర్ రిలీజ్

వరుణ్ తేజ్ – ప్రవీణ్ సత్తార్ కలయికలో గాండీవధారి అర్జున అనే మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఆగస్టు 25 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గని , ఎఫ్ 3 లతో వరుస ప్లాప్స్ అందుకున్న వరుణ్ ..ఈ మూవీ ఫై భారీ ఆశలే పెట్టుకున్నాడు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టేనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌తోనే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ‘గాండీవధారి అర్జున’ మూవీలో వరుణ్ తేజ్.. జేమ్స్ బాండ్ తరహా పాత్ర పోషించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన వీడియోస్ సినిమా ఫై ఆసక్తి రేపగా..తాజాగా నేడు సోమవారం సినిమా తాలూకా యాక్షన్ ట్రైలర్ ను రిలీజ్ చేసారు.

భారీ యాక్షన్ సీన్స్ .. ఛేజింగ్స్ పై కట్ చేసిన ఈ ట్రైలర్, సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ‘ప్రపంచానికి నిజం తెలియాలి’ అంటూ తన ఆపరేషన్ ను పూర్తి చేయడంలో హీరో ప్రాణాలను పణంగా పెట్టడం కనిపిస్తోంది. ఫారిన్ లో రిస్కీ ఫైట్లను చిత్రీకరించారనే విషయం అర్థమవుతూనే ఉంది. హీరోతో పాటు హీరోయిన్ కూడా ఈ ఆపరేషన్ లో భాగంగా కనిపిస్తోంది. తుపాకుల మోతలు .. కార్ల ఛేజింగ్స్ .. బ్లాస్టింగ్స్ తో ట్రైలర్ ను హోరెత్తించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకం పై బివిఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.

YouTube video