నేటితో ముగియనున్న కవిత జుడీషియల్ కస్టడీ

Kavitha is in judicial custody till 23rd of this month

లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన MLC కవిత జుడీషియల్ కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో ED, CBI ఆమెను వర్చువల్ కోర్టులో హాజరుపర్చనున్నాయి. కవిత కస్టడీని మరోసారి పొడిగించాలని దర్యాప్తు సంస్థలు కోరనున్నాయి. మరోవైపు ఈడీ అరెస్టె ఫై కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై తీర్పును జడ్జి మే 2కు వాయిదా వేశారు. సీబీఐ అరెస్ట్పె వేసిన బెయిల్ పిటిషన్ ఫై వాదనలు నిన్న ప్రారంభం కాగా నేడూ కొనసాగనున్నాయి.

కాగా ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో కల్వకుంట్ల కవితది కీలక పాత్ర అని రౌస్‌ అవెన్యూ కోర్టులో సీబీఐ బలమైన వాదనలను వినిపించింది. సీబీఐ తరఫు న్యాయవాది వాదనలను వినిపిస్తూ.. కవితకు బెయిల్‌ ఇస్తే.. ఆమె విడుదలయ్యాక సాక్షులను ప్రభావితం చేస్తారని వివరించారు. ఆమెకు బెయిల్‌ ఇవ్వొద్దని కోరారు. తనపై ఈడీ, సీబీఐ నమోదు చేసిన కేసుల్లో బెయిల్‌ మంజూరు చేయాలంటూ రౌస్‌ అవెన్యూ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే..! ఈ పిటిషన్లపై ప్రత్యేక న్యాయమూర్తి కావేరి భవేజా సోమవారం వేర్వేరుగా విచారణ చేపట్టారు.