బండి సంజయ్ అరెస్ట్‌.. ధైర్యం కోల్పోవద్దని ఫోన్ చేసిన అమిత్ షా

బండి సంజయ్ ను కరీంనగర్ లోని నివాసానికి తరలించిన పోలీసులు

police-took-bandi-sanjay-to-his-residence-in-karimnagar

హైదరాబాద్ః ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంశంపై టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద ఆందోళన చేస్తున్న బిజెపి నేతలను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ… జనగామ జిల్లాలో బండి సంజయ్ చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేశారు. సంజయ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు అక్కడి నుంచి కరీంనగర్ లోని ఆయన నివాసానికి తరలించారు. మరోవైపు బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్ ల అరెస్ట్ పై బిజెపి అధిష్ఠానం ఆరా తీస్తోంది. తెలంగాణలో ప్రస్తుత పరిస్థితిపై వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటోంది. ఇంకోవైపు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు, బిజెపి పెద్దలు ఆయనకు ఫోన్ చేశారు. ధైర్యం కోల్పోవద్దని బండి సంజయ్ కు అమిత్ షా చెప్పారు. ప్రభుత్వ అవినీతి, వైఫల్యాలపై పోరాటాన్ని కొనసాగించాలని సూచించారు. మరోవైపు తన అరెస్ట్ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ… ఇలాంటి అరెస్ట్ లకు భయపడే ప్రసక్తే లేదని అన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/international-news/