దారుణం : వృద్ధురాలి కాళ్లను నరికి వెండి కడియాలను ఎత్తుకెళ్లిన దుండగులు

రాజస్థాన్ జైపుర్​లోని బస్ బదన్​పురామీనా కాలనీలో దారుణం చోటుచేసుకుంది. వెండి కడియాల కోసం ఏకంగా వృద్ధురాలి కాళ్లను నరికారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..​లోని బస్ బదన్​పురామీనా కాలనీలో నివాసం ఉండే 108 ఏళ్ల వృద్ధురాలు జమునా దేవి.. తన ఇంటి వరండాలో ఉన్న సమయంలో దుండగులు ఆమెను బాత్​రూమ్​లోకి లాక్కెళ్లారు.

అనంతరం బాధితురాలి కాళ్లను నరికేసి వెండి కడియాలను ఎత్తుకెళ్లిపోయారు. గుడికి వెళ్లిన బాధితురాలి కుమార్తె ఇంటికి వచ్చి …తల్లిని ఆలా చూసి తల్లడిల్లిపోయిఇంది. వెంటనే తల్లిని ఎస్​ఎమ్​ఎస్​ ఆస్పత్రికి తరలించింది. ఈ ఘటన ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. వృద్ధురాలిపై దాడికి నిందితులు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వెంటనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు.