అర్ధరాత్రి బండి సంజయ్ అరెస్ట్

అర్ధరాత్రి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ని పోలీసులు అరెస్ట్ చేయడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి ఆందోళనలు చేస్తుంది. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని బండి సంజయ్ కోరగా.. ఏ ఇష్యూ లేకపోయినా అదుపులోకి తీసుకునే అధికారం ఉందంటూ పోలీసులు ఆయనను బలవంతంగా తమ వాహనంలో ఎక్కించుకున్నారు. కరీంనగర్‌ నుంచి భువనగిరి జిల్లా బొమ్మల రామారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బండి సంజయ్‌ను తరలించే సమయంలో కార్యకర్తలు, కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. కార్యకర్తలను పక్కకుతోస్తూ పోలీసులు బండి సంజయ్‌ను తరలించారు. దీంతో నివాసం వద్ద పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తతంగా మారాయి.

ప్రస్తుతం బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడికి చేరుకున్న బీజేపీ నేతలు పోలీస్ స్టేషన్ లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుంటున్నారు. సంజయ్‌ అరెస్ట్‌ను బీజేపీ జాతీయ నాయకత్వం ఖండించింది. బీఆర్ఎస్‌ మునిగిపోయే నావ అంటూ బీఎల్‌ సంతోష్ మండిపడ్డారు. రాజకీయంగా BRSకు సమాధి అయ్యే రోజులు దగ్గరపడ్డాయి.. కేసీఆర్‌కు పాలన చేతగాక సంజయ్‌ను అరెస్ట్ చేయించారు.. అంటూ మండి పడ్డారు.